ప్రస్తుతం డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హవా నడుస్తోందని చెప్పవచ్చు. లాక్ డౌన్ సమయంలో ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ బాగా పుంజుకున్నాయి. ఓటీటీలకు భారీగా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరగడంతో పాటు భారీ వ్యూయర్ షిప్ వస్తోంది. పరిస్థితులను బట్టి చూస్తే ఇకపై సినిమాలన్నీ థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీలలో రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కరోనా ఎఫెక్ట్ ఎప్పటివరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి.. ఒకవేళ కరోనా కంట్రోలై లాక్ డౌన్ ఎత్తేసినా కూడా జనాలు సినిమా థియేటర్స్‌ ఒకప్పటిలా వచ్చి ఎగబడి సినిమా చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలియదు. దీంతో ఇంట్లోనే ఉంటున్న జనాలు ఓటీటీల ను ఆశ్రయిస్తున్నారు.. ఆశ్రయిస్తారు కూడా. ఎందుకంటే ఫ్యూచర్ లో వాటిదే రాజ్యం కాబోతోందని చెప్పవచ్చు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అన్నింట్లోకి నెట్ ఫ్లిక్స్ రేంజి వేరు. మిగతా ఓటీటీలు ఎక్కువగా సినిమాల మీదే ఆధారపడతాయి కానీ.. నెట్ ఫ్లిక్స్ సొంత సిరీస్‌లతో ఎప్పుడూ తన ప్రత్యేకత చాటుకుంటూ ఉంటుంది. ఆ సంస్థ నిర్మించే ఒరిజినల్స్‌లో క్వాలిటీ ఏ రేంజిలో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. వెబ్ సిరీస్‌ల విషయంలో నెట్ ఫ్లిక్స్‌కు ఉన్న గుడ్ విల్‌ వేరు. వాళ్ల నుంచి ఓ సిరీస్ వచ్చిందంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని భావిస్తారు. ఆ నమ్మకంతోనే ‘మిసెస్ సీరియల్ కిల్లర్’ పేరుతో వచ్చిన హిందీ సిరీస్‌ను ఆసక్తిగా చూశారు ప్రేక్షకులు. అయితే ఈ సిరీస్ చూశాక నెట్ ఫ్లిక్స్‌ మీద బూతుల వర్షం కురుస్తోంది.

 

‘నెట్ ఫ్లిక్స్’ చరిత్రలోనే అత్యంత చెత్త కంటెంట్ ఉన్న సిరీస్ ఇదే అంటూ నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. తమ విలువైన సమయాన్ని వృథా చేశారంటూ మండిపడుతున్నారు. గతంలో అక్షయ్ కుమార్ హీరోగా ‘జోకర్’ అనే చెత్త సినిమా తీసిన శిరీష్ కుందర్ డైరెక్ట్ చేసిన సిరీస్ ఇది. ఈ ‘మిసెస్ సీరియల్ కిల్లర్’ దాన్ని మించిన చెత్త అంటూ నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు. ఇది చూశాక నెట్ ఫ్లిక్స్ మీద ఉన్న నమ్మకమే పోయిందని అంటున్నారు. మనోజ్ బాజ్‌పేయి లాంటి నటుడు ఇందులో ఎలా నటించాడని ప్రశ్నిస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటన గురించి ఏకిపడేస్తున్నారు. సిరీస్ ఆరంభంలో ‘టార్చర్ అంటే మీకు తెలియదు. ఇకపై చూస్తారు’ అంటూ జాక్వెలిన్ నోట ఓ డైలాగ్ వస్తుంది. ఇది ఈ సిరీస్‌ను ఉద్దేశించి పెట్టిందే అని.. ఆ హెచ్చరిక చూడగానే తర్వాత చూడటం ఆపేయాల్సిందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. దీంతో నెట్ ఫ్లిక్స్‌కు ఉన్న గుడ్ విల్‌ దిగజారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: