టాలీవుడ్ లో స్టార్ హీరో అవుతాడు అని భావించిన వారిలో తరుణ్ ఒకరు. తరుణ్ సినిమాలు కెరీర్ తొలి నాళ్లలో మంచి విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. అగ్ర దర్శకులు కూడా అతని తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించే వారు. అయితే కెరీర్  పీక్ దశలో ఉన్నప్పుడు అతని చేష్టలు కొన్ని కెరీర్ ని బాగా ఇబ్బంది పెట్టాయని అంటున్నారు. ఒక ప్రేమ వ్యవహారం అతని జీవితాన్నే పూర్తిగా మార్చేసింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించాయి. అతను అనవసర విషయాలో ఎక్కువగా దృష్టి పెట్టడమే అతని కెరీర్ పతనానికి ప్రధాన కారణమని అన్నారు. 

 

అతను ఒక సినిమా చేస్తున్న సమయంలో ఒక హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు అని తర్వాత్ ఆమె అతన్ని వివాహం చేసుకోవాలి అని చూసింది అని కాని అది సాధ్యం కాలేదు అని తరుణ్ కుటుంబ సభ్యులు ఆ వివాహానికి అంగీకరించలేదు అని దీనికి తోడు కొందరు అతన్ని అప్పటి నుంచి టార్గెట్ చేయడం మొదలుపెట్టారని దాన్ని అతను తట్టుకోలేక ఒత్తిడిలోకి వెళ్ళిపోయి మంచి సినిమా కథలను ఎంపిక చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు అని ప్రచారం జరిగింది. ఒక హోటల్ లో అతనికి వార్నింగ్ కూడా ఇచ్చారట కొందరు పెద్దలు. 

 

ఆమెను అతను ఆర్ధికంగా కూడా వాడుకున్నాడు అని ఆరోపణలు వచ్చాయి. అది నిజం అయినా కాకపోయినా సరే మీడియా మాత్రం వాటికి చాలా వరకు ప్రాధాన్యత ఇచ్చింది అనేది మాత్రం వాస్తవం. అతని కెరీర్ లో అది ఒక పెద్ద తప్పు అని అక్కడి నుంచే అతను నిలబడలేకపోయాడు అని అంటారు. ఆ తర్వాత అతను కెరీర్ లో నిలబడే ప్రయత్నాలు చేసినా సరే అది పెద్దగా ఫలించలేదు అని అన్నారు. ఆ తర్వాత అతని సినిమాలకు ఆదరణ లేకుండా పోయింది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: