దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. కాలక్షేపం కోసం టీవీలు.. సోషల్ మీడియా మాధ్యమాలతో గడుపుతున్నారు. చూసిన సినిమాలనే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. దీంతో సిల్వర్ స్క్రీన్ మీద అట్టర్ ప్లాప్ అయిన సినిమాలు కూడా ఇప్పుడు మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. ఈ కోవకే చెందిన మూవీ 'శ్రీనివాస కల్యాణం'. 'శతమానం భవతి' సినిమాతో సూపర్ హిట్ సాధించిన దర్శకుడు సతీష్ వేగేశ్న మరోసారి దిల్ రాజు నిర్మాణంలో చేసిన సినిమా 'శ్రీనివాస కళ్యాణం'. శతమానం భవతి సినిమాలో కుటుంబ బంధాలు, ప్రేమల విలువలు చెప్పిన దర్శకుడు.. ఈ సారి తెలుగింటి సాంప్రదాయాలు, పెళ్లి విలువలు ఈ తరానికి పరిచయం చేసే ప్రయత్నం చేశారు. పెళ్లి అనేది ఓ ఈవెంట్‌లా మారిపోతున్న ఈ రోజుల్లో పెళ్లి బంధుమిత్రులతో కలిసి జరుపుకునే ఓ అందమైన జ్ఞాపకం అని తెలియజేసే ప్రయత్నమే శ్రీనివాస కళ్యాణం.

 

నితిన్ - రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా నటించిన 'శ్రీనివాస కళ్యాణం' చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద మాత్రం సూపర్ హిట్ అవుతుంది. యూట్యూబ్‌లో ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ 100 మిలియన్ వ్యూస్‌ని సాధించింది. ఒక ప్లాప్ సినిమాకి ఈ రేంజ్ వ్యూస్ రావడం అంటే అది మాములు విషయం కాదు. కాగా పెళ్లి నేపథ్యంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఫ్యామిలీ ఆడియన్స్ ని మరియు విలేజ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందట. అందుకే అన్ని వ్యూస్ వచ్చాయి అంటున్నారు. ఏమైనా ఈ చిత్రం థియేటర్స్ లో సేఫ్ ప్రాజెక్ట్ గా నిలవలేక పోయినా.. డబ్బింగ్ వెర్షన్ తో మాత్రం లాభాలను తెసోంది.

 

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం లాక్ డౌన్ సమయాన్ని బాగా క్యాష్ చేసుకుందని చెప్పవచ్చు. లాక్ డౌన్ కి ముందు తక్కువ వ్యూస్ ఉన్న ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 100 మిలియన్ వ్యూస్‌ సాధించడం మాములు విషయం కాదు. భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జయసుధ, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్, నందిత శ్వేత, సితార, విద్యుల్లేఖ రామన్‌, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించగా సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫి అందించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: