పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యూత్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చేసింది పాతిక సినిమాలే అయినా సీనియర్ స్టార్ హీరోలకు ఉన్న క్రేజీ ఫాలోయింగ్ పవర్ స్టార్ కు ఉంది. ఆ విషయంలో డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఇక ఏ హీరో సినిమా ఈవెంట్ అయినా సరే పవర్ స్టార్ పేరు వినపడితే చాలు అరుపులు కాకలు కామన్. అయితే పవర్ స్టార్ స్టామినా చూపించే సినిమాలు, వసూళ్లు తెలిసినవే. అయితే ఆ స్టామినాకు తగినట్టుగా సినిమాలు తీయడం కూడా కొందరికే సాధ్యం.

 

అలాంటి వారిలో త్రివిక్రమ్ ఒకరని చెప్పొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఉండే అంచనాలకు తగినట్టుగా ఆయన సినిమాలు ఉంటాయి. సినిమా కథ కథనాలు ఎలా ఉన్నా పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే డైలాగ్స్ విషయంలో మాత్రం రాజీ పడదు త్రివిక్రమ్. అందుకే తీసిన మూడు సినిమాల్లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి. హీరో పాత్ర ద్వారా తాను చెప్పే విషయాన్నీ ఎంతో అందమైన డైలాగ్ రూపంలో చెప్పించే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ అనగానే ఆయనకు ఉన్న పర్సనల్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని డైలాగ్స్ రాస్తాడు. అంటే త్రివిక్రమ్ వేరే హీరోలకు మంచిగా రాయడని కాదు పవన్ అంటే ఇంకాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతాడు అంతే. జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి ఈ మూడు సినిమాల్లోని డైలాగ్స్ చూస్తే  మనకే అర్ధమవుతుంది. 

 

మూడు సినిమాల్లో ఒకటి ప్లాపు,  ఒకటి  యావరేజ్,  ఒకటి సూపర్ హిట్ ఇలా మూడు సినిమాలు మూడు ఫలితాలు ఇచ్చాయి. ఐతే మరోసారి పవన్, త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తే చూడాలని అనుకుంటున్నారు సినీ ప్రియులు. మరి అది ఎప్పుడు కుదురుతుందో చూడాలి. ప్రస్తుతం పవన్ మూడు వరుస సినిమాలు లైన్ లో ఉన్నాయి. అవి పూర్తయ్యాక త్రివిక్రమ్ సినిమా ఉండే ఛాన్స్ ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: