తెలుగులో బ్రహ్మానందం సినిమాలు అనగానే జనాలకు ఒక ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తారో అందరికి తెలిసిందే. సినిమాలో ఆయన పాత్ర గురించి ప్రత్యేకంగా సినిమా చూసిన తర్వాత మాట్లాడుకునే వాళ్ళు ప్రేక్షకులు. ఆయన కెరీర్ లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా... అహనా పెళ్ళంట. ఆ సినిమాలో ఆయన కోటా పక్కన చేసిన నటన ఎప్పటికి ఎవర్ గ్రీన్. ఆ పాత్రలో ఆయనను ఎంపిక చేసిన తీరు కూడా ఒక సంచలనం. సినిమాలో కోటా శ్రీనివాసరావు నటన ఏ స్థాయిలో హైలెట్ అయిందో బ్రాహ్మి నటన అంతకు మించి అయింది అనేది వాస్తవం. 

 

ప్రతీ సన్నివేశంలో బ్రాహ్మీ జీవించారు. ఆయన నిక్కర్ తో, అర గుండు తో చేసిన నటన, కోటా పక్కన మాట్లాడిన మాటలు అన్నీ కూడా ఒక రేంజ్ లో కామెడి ని పంచాయి అనేది వాస్తవం. ఆ సినిమాలో ఆయన నటనకు అవార్డులు కూడా వచ్చాయి. ఆ స్థాయిలో ఆ నటన ఆకట్టుకుంది. టీ అమ్మిన సమయంలో బస్సు వద్ద బ్రాహ్మీ హావభావాలు, అరటి పళ్ళ వ్యక్తి దగ్గర బ్రాహ్మీ నోటి నుంచి వచ్చిన మాటలు అన్నీ కూడా ఒక సంచలనం అప్పట్లో. ఆ స్థాయిలో ఏ కమెడియన్ కూడా అప్పట్లో ఆ విధంగా నటించలేదు అనేది వాస్తవం. 

 

ప్రతీ సన్నివేశం కూడా అలా నిలిచిపోయింది. ఆ సినిమా తర్వాత బ్రహ్మానందం చేసే పాత్రలకు గానూ మంచి డిమాండ్ వచ్చింది. అగ్ర దర్శకులు నిర్మాతలు అందరూ కూడా ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు. కోట శ్రీనివాసరావు కూడా బ్రహ్మానందం నటన చూసి షాక్ అయ్యారట. ఆ సినిమా తర్వాత బ్రాహ్మీ పారితోషికం కూడా బాగా పెంచారు. అగ్ర హీరోలు అందరి తో ఆయనకు అవకాశాలు వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: