టాలీవుడ్ లో కామేడిలో, విలనిజంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నటుడు రావు గోపాల రావు. ఆయన చేసిన పాత్రలు గాని ఆయన చేసిన కామెడి గాని టాలీవుడ్ చరిత్రలో అలా నిలిచిపోయింది అనేది వాస్తవం. రావు గోపాల్ రావు సినిమాలో ఉన్నారు అంటే ఆయన పాత్ర గురించి ప్రత్యేకంగా చర్చలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా ఆయన తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. టాలీవుడ్ లో ఆయనను మించిన నటుడు ఉండరు లేరు అని ఎందరో దర్శక నిర్మాతలు ఎన్నో సందర్భాల్లో వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. 

 

ఆ విధంగా ఆయన తెలుగు సినిమా మీద ప్రభావం చూపించారు. ప్రతీ సన్నివేశం కూడా ఆయన జీవించినట్టు ఉంటుంది గాని నటించినట్టు ఉండదు అనేది వాస్తవం. ఆయన కెరీర్ లో ఎన్టీఆర్, అక్కినేని, శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి, వెంకటేష్ వంటి హీరోల్లో విలన్ గా చేసారు. విలన్ గా కామెడి పండించవచ్చు అని నిరూపించిన నటుడు ఆయన. ఆయనకు ముందు ఆయన తర్వాత అనేది విధంగా విలన్ అయినా కామెడి అయినా సరే ఉండేది. విలన్ గా నటించినా సరే కామెడికి మంచి గుర్తింపు ఉంటుంది అనేది వాస్తవం. 

 

ఏ సినిమాలో అయినా సరే ఆయన హీరోకి తగిన విధంగా నటించే వారు. హీరో పాత్ర కంటే ఆయన పాత్ర హైలెట్ అయిన సినిమాలు ఎక్కువగానే ఉన్నాయి. రాజకీయ నాయకులకు దీటుగా ఆయన సినిమాల్లో కొన్ని ప్రసంగాలు ఉండేవి కామెడి పండించేవి అనేది వాస్తవం. చిరంజీవి, ఎన్టీఆర్ సినిమాల్లో ఆయన చేసిన కామెడి అలా నిలిచిపోయింది. ఏ పాత్రకు అయినా సరే ఆయన అలా సరిపోయే వారు అనేది వాస్తవం. నటనలో ఆయన ఎప్పటికి అయినా సరే రారాజు అని అంటూ ఉంటారు తెలుగు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: