సునీల్... ఒకప్పుడు ఈ వ్యక్తి తెర మీద కనపడితే అభిమానులకు ఒకరకంగా పండగ వాతావరణమే. టాలీవుడ్ లో 2000 తర్వాత సునీల్ చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించారు. బాలకృష్ణ, చిరంజీవి, జగపతి బాబు, వెంకటేష్ సహా కొందరి హీరోల సినిమాల్లో ఆయన కామెడి హైలెట్ గా నిలిచేది అప్పట్లో. వెంకటేష్ హీరోగా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆయన మంచి పాత్ర చేసారు. ఆ సినిమాలో వెంకటేష్ పక్కన సునీల్ చేసిన కామెడికి మంచి ప్రాధాన్యత లభించింది. హీరోలతో సమానంగా పారితోషికం తీసుకునే వారు. 

 

రవి తేజా సినిమాల్లో కూడా ఆయన పాత్ర బాగుండేది. దుబాయ్ శీను సినిమాలో సునీల్ ని చూసి నవ్వుకున్నారు ప్రేక్షకులు. జగపతి బాబు హీరోగా వచ్చిన పెదబాబు సినిమాలో ఆయన కామెడికి మంచి మార్కులు పడ్డాయి. రాజకీయ నాయకుడుగా ఆయన నటన ఆకట్టుకుంది. సునీల్ లేని సినిమా అంటూ ఉండేది కాదు అప్పట్లో. మహేష్ బాబు హీరోగా వచ్చిన కొన్ని సినిమాల్లో కూడా సునీల్ పాత్రకు మంచి డిమాండ్ ఉండేది. తరుణ్, ఉదయ్ కిరణ్ హీరోలుగా వచ్చిన సినిమాల్లో సునీల్ కే ఎక్కువ పారితోషికం ఉండేది. 

 

గోదావరి యాస లో సునీల్ మాట్లాడే మాటలకు మంచి ఆదరణ ఉండేది అనేది వాస్తవం. ప్రతీ సినిమాలో కూడా సునీల్ అలా అలరించారు ప్రేక్షకులను. ఫ్యాక్షన్ సినిమా అయినా సరే సునీల్ కామెడి లేకుండా ఉండేది కాదు అప్పట్లో. హీరోలకు మించి పారితోషికం తీసుకునే వారు. తరుణ్ హీరోగా వచ్చిన సినిమాల్లో సునీల్ చేసిన కామెడి చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ విధంగా సునీల్ తన ముద్ర వేసుకున్నాడు. అగ్ర హీరోల సినిమాలు అనగానే సునీల్ కామెడి తప్పకుండా ఉండాల్సిందే అనే అభిప్రాయం ప్రేక్షకులు కూడా వ్యక్తం చేసే వారు అప్పట్లో.

మరింత సమాచారం తెలుసుకోండి: