దర్శకుడు పరశురామ్.. మహేశ్ బాబును డీల్ చేసే కెపాసిటీ ఉందా..  మహేశ్ బాబు ఫ్యాన్స్ ఈ విషయం గురించి ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. సాధారణంగా పరశురామ్ సినిమాల్లో ఎమోషన్స్.. అనుబంధాలు.. కామెడీ ఎక్కువ పర్సంటేజ్ లో ఉంటాయి. మరి స్టార్ మూవీ అంటే.. బిల్డప్ సీన్స్ ఉండాలి. హీరోయిజాన్ని హైలెట్ చేయాలి. మరి ఇవన్నీ మహేశ్.. పరశురామ్ సినిమాలో సమపాళ్లలో ఉంటాయా.. ఉండవా.. పరశురామ్ ను అడిగితే అంతకుమించి ఉంటాయంటున్నాడు పరశురామ్. 

 

ఆగస్ట్ 15కు గీత గోవిందం రిలీజ్ అయి రెండేళ్లవుతుంది. ఈ గ్యాప్ లో పరశురామ్ డైరెక్షన్ లో చాలామంది కథానాయకుల పేర్లు వినిపించినా ఏదీ కుదరలేదు.  పరశురామ్ కెరీర్ లో రెండేళ్లు వేస్ట్ అయిపోయిందన్న కామెంట్స్ వచ్చినా.. ఈ టైమ్ లో నాలుగు కథలు రెడీ చేశాడు. రెండు కథలు నాగచైతన్య కోసం.. ఒకటి మహేశ్ కోసం.. మరొకటి లేడీ ఓరియెంటెడ్ స్టోరీ తయారు చేసుకున్నాడు. గీత గోవిందం తర్వాత పరశురామ్ సినిమా సెట్స్ పైకి రాకపోయినా.. మున్ముందు గ్యాప్ రాకుండా నాలుగు కథలు రెడీగా పెట్టుకున్నాడు. 

 

పరశురామ్ ఎట్టకేలకు నాగచైతన్యతో సినిమా ఎనౌన్స్ చేశాడు. ఇంతలో మహేశ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. షూటింగ్స్ కు పర్మీషన్ ఇవ్వగానే.. సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఓ ఇంటర్వూలో సినిమాకు సంబంధించిన విశేషాలు తెలియజేశాడు పరశురామ్. నాగచైతన్య సినిమా వాయిదా పడిందేగానీ.. క్యాన్సిల్ కాలేదన్నారు. చైతూ కెరీర్ బెస్ట్ సబ్జెక్ట్ అవుతుందని చెప్పాడు పరశురామ్. 

 

అభిమాని హీరోను డైరెక్ట్ చేయడం ఈ మధ్య నడుస్తున్న ట్రెండ్. పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయిన హరీశ్ శంకర్ గబ్బర్ సింగ్ తీసి హిట్ కొట్టాడు. మెగాస్టార్ అభిమాని అయిన వినాయక్.. ఠాగూర్.. ఖైదీ నెంబర్ 150 తీసి అభిమాన హీరోకు రెండు హిట్స్ ఇచ్చాడు. ఇదే వరుసలో పరశురామ్ కూడా మహేశ్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: