ఈ మధ్య కాలంలో న్యాచురల్ స్టార్ నానీ సినిమాలకు ఆదరణ తగ్గింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఆయన సినిమాల కోసం ఒకప్పుడు ఎదురు చూసిన వాళ్ళు ఇప్పుడు చూడటం లేదని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిర్మాతలు కూడా ఆయన తో సినిమా చేయడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు అయితే ఇప్పుడు పరిస్థితి మారింది అని అంటున్నారు. నానీ సినిమాల కోసం ఇప్పుడు మళ్ళీ దర్శక నిర్మాతలు ఎదురు చూస్తున్నారని అంటున్నారు. సినిమాలు అన్నీ కూడా ఫ్లాప్ అవుతున్నాయి అని ఇన్నాళ్ళు నానీ ని పక్కన పెట్టారు కొందరు... 

 

అతను ఈ మధ్య కాలంలో ఒక్కటి అంటే ఒక్కటి కూడా మంచి సినిమా చేయని సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ నానీ ట్రాక్ లో పడ్డాడు. వరుసగా సినిమాలు చేయడమే కాకుండా విలన్ గా కూడా సినిమాలను చేస్తున్నాడు. సినిమా హిట్ ఫ్లాప తో సంబంధం లేకుండా జాగ్రత్తగా సినిమాలు చెయ్యాలి అని నానీ భావిస్తున్నాడు. ప్రస్తుతం అతను రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా ఇప్పుడు వాయిదా పడ్డాయి. ఇప్పుడు నానీ రెండు సినిమాలను ఓకే చేసాడని సినిమా కథ విన్న నానీ కథ నచ్చడం తో సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు 

 

ఇది ఇలా ఉంటే నానీ నిర్మాతగా కూడా సినిమాలను చేసే ఆలోచనలో ఉన్నాడు అనే ప్రచారం జరుగుతుంది. చిన్న హీరోలు అలాగే కథ భిన్నంగా ఉన్న సినిమాలను చెయ్యాలని భావిస్తున్నాడు నానీ. మరి అది ఎంత వరకు ఫలిస్తుంది అనేది చూడాలి. నానీ సినిమాల మీద ఇప్పుడు మళ్ళీ దర్శకులకు నమ్మకం రావడానికి కారణం ఏంటీ అనేది తెలియకపోయినా అతని సినిమాల ను చెయ్యాలని చూస్తున్నారు. మరి ఎన్ని సినిమాలు చేస్తాడు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: