'పెళ్లి చూపులు' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు యంగ్ సెన్సేషనల్ విజయ్ దేవరకొండ. గతంలో 'ఎవడే సుబ్రహ్మణ్యం' 'నువ్విలా' సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ పోషించాడు. మొదటి సినిమానే మంచి విజయాన్ని సాధించడంతో అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమాతో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారాడు. 'గీత గోవిందం' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న మన దేవరకొండకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. ఏదైనా సూటిగా సుత్తి లేకుండా మొహం మీద చెప్పేసే అతని ఆటిట్యూడ్ అమ్మాయిలు ఇష్టపడుతుంటారు. లాక్ డౌన్ టైంలో ఇంట్లోనే ఉంటున్న విజయ్ దేవరకొండ అనేక సేవా కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు. మిడిల్ క్లాస్ ఫండ్ పేరిట సామాజిక కార్యక్రమాలను చేపట్టారు. దేశవ్యాప్తంగా ఆకలితో పస్తులుండే వారి కోసం నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టారు. ఇలాంటి కార్యక్రమాలతో కాలం గడుపుతున్న విజయ్ దేవరకొండ తాజాగా ఒక ఇంగ్లీష్ టెలివిజన్ ఛానెల్ తో తాను నటించబోయే సినిమాల విషయాలు పంచుకొన్నారు.
ఇంతకముందు ప్రచారం జరిగినట్లే శివ నిర్వాణ దర్శకత్వంలో తాను నటిస్తున్నట్లు అతను ఖరారు చేశాడు. కానీ అందరూ అనుకుంటున్నట్లు విజయ్ ఆ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్లో చేయట్లేదు. శివ సినిమాకు నిర్మాత వేరని అతను చెప్పకనే చెప్పాడు. తన తర్వాతి సినిమా శివతో ఉంటుందని మాత్రమే చెప్పిన విజయ్.. ఆ తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్లో సినిమా చేస్తానన్నాడు. ఆ సినిమాకు దర్శకుడు ఎవరనే విషయంలో విజయ్ సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. రాజు నిర్మాణంలో నటించడానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్నానని.. ఇప్పటికే కథ, దర్శకుడు ఖరారయ్యారని చెప్పాడు. ఇప్పుడే ఆ వివరాలు వెల్లడిస్తే మజా ఉండదన్న విజయ్.. త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తానన్నాడు. ఇక ఫైటర్ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేయడం గురించి అడిగితే.. తాను ఏదో ట్రై చేస్తున్నానని.. ఐతే సిక్స ప్యాక్ వస్తుందో లేదో మాత్రం చెప్పలేనని అన్నాడు. ఇది బాక్సింగ్ సినిమా కాదని.. మార్షల్ ఆర్ట్స్ మిక్స్‌తో నడుస్తుందని చెప్పాడు. పూరితో సినిమా చాలా క్రేజీగా ఉంటుందని.. అది ఒక పండగ లాంటి సినిమా అని.. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని విజయ్ అన్నాడు. ఏదేమైనా 'ఫైటర్' సినిమా తర్వాత మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ దేవరకొండ లైన్ లో పెట్టాడని క్లారిటీ అయితే వచ్చింది.