ప్రస్తుతం  బాలీవుడ్ లో మన తెలుగు హీరోలకు డిమాండ్ ఉంది. అయితే ఇప్పుడు కొందరు మాజీ హీరోయిన్ ల మీద కూడా బాలీవుడ్ జనాలు ఆసక్తి చూపిస్తున్నారు అని అంటున్నారు. బాలీవుడ్ లో మన మాజీ హీరోయిన్ లకు అవకాశాలు ఇచ్చే సూచనలు కనపడుతున్నాయి. విజయశాంతికి బాలీవుడ్ లో అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం అనేది పక్కన పెడితే విజయశాంతికి బాలీవుడ్ లో అవకాశం వచ్చింది అని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. 

 

ఆమెకు అక్కడ మంచి పాత్ర కూడా వచ్చింది అనే ప్రచార౦ ఎక్కువగానే జరిగింది. ఆమె ఎంత వరకు అక్కడి సినిమా చేస్తుంది అనేది పక్కన పెడితే ఆమెకు ఒక మంచి పాత్రను సిద్దం చేసారని అంటున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆమె ఒక మంచి పాత్ర చేసారు. ఆ పాత్ర తర్వాత ఆమెకు బాలీవుడ్ లో అవకాశం వచ్చింది అని ప్రచారం జరిగింది. కాని ఆమె చేయడం లేదు అని కూడా అన్నారు టాలీవుడ్ జనం. కాని ఇప్పుడు ఆమె ఆ పాత్ర చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి చేస్తుందో లేదో చూడాలి. కాని ఆమెకు సినిమాల మీద ఆసక్తి లేదని అంటున్నారు. 

 

అయినా సరే ఆమె కొన్ని కారణాలతో సినిమాలు చేయడానికి సిద్దం అయ్యారని సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలను పక్కన పెట్టి కాస్త కథలకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈమెకు ఇచ్చే పాత్ర కూడా కథ చాలా భిన్నం గా ఉన్న సినిమాలో అని అంటున్నారు. మరి ఆమె సినిమా చేస్తుందో లేదో చూడాలి. ఆమెకు అవకాశం ఇచ్చే దర్శకుడు ఎవరు అనేది కూడా చూడాలి. ప్రస్తుతం ఆమె ఏ సినిమా చేయడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: