IHG's signature <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DANCE' target='_blank' title='dance-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>dance</a> moves will ...

 అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ని షేక్ చేసిన విషయం తెలిసిందే. సినిమా రిలీజ్ ముందునుంచే ఈ సినిమా పాటలు  యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. ఈ సినిమా సాంగ్స్ పొందినంత పబ్లిసిటీ ఏ సినిమా పొందలేదనే  చెప్పాలి. తమన్ స్వరపరిచిన బాణీలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు రికార్డులను సృష్టించాయి. ఈ సినిమా విడుదలకు ముందే లిరికల్ వీడియో సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి.  

IHG

 

'బుట్ట బొమ్మ...', 'రాములో రాముల....' 'సామజ వర గమన...' వంటి సాంగ్స్ మంచి  క్రేజ్ దక్కించుకున్నాయి. ప్రతి సాంగ్ కూడా 100 మిలియన్ మార్కును చేరుకున్నాయి. ఇక సినిమా విడుదల తర్వాత వీడియో సాంగ్స్ కి వస్తున్న రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా బుట్ట బొమ్మ సాంగ్ టాప్ లో నిలిచింది. బుట్ట బొమ్మ సాంగ్ మంచి ట్యూన్ తో పాటు అల్లు అర్జున్ డాన్స్  తోడవడంతో మంచి హిట్ ను అందుకుంది. ఈ సాంగ్స్ హిట్ అవటంతో శిల్పా శెట్టి, డేవిడ్ వార్నర్, దిశా పటాని  వంటి సెలబ్రిటీలు ఆ పాటకు డాన్సులు వేసి తమ ఇష్టాన్ని ప్రదర్శించారు. 2 నెలల క్రితం బుట్ట బొమ్మ సాంగ్ ను యూట్యూబ్ లో అప్లోడ్ చేయగా ప్రస్తుతం ఈ సాంగ్ 150  మిలియన్స్ కి పైగా వ్యూస్ పొందింది మరియు 1.3 మిలియన్ లైక్లను పొందింది. ఈ రికార్డును బట్టి వచ్చే రోజుల్లో ఈ సాంగ్ మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని మీడియా వర్గాలు ఉన్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: