టాలీవుడ్ లో ఇప్పుడు యాంకర్లకు మంచి అవకాశాలు వస్తున్న సంగతి తెలిసిందే యువ హీరోల సినిమాల్లో యాంకర్లకు అవకాశం ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కీలక పాత్రలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న హీరోలు అందరూ కూడా తమ సినిమాకు క్రేజ్ రావాలి అంటే సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారిని తీసుకోవాలని దర్శక నిర్మాతలకు సూచనలు చేస్తున్నారు. ఇప్పుడు అనసూయ కు చిన్న హీరోల సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. మరి ఏ సినిమాలో ఆమె చేస్తుందో గాని ఇప్పుడు కొన్ని వార్తలు వస్తున్నాయి. 

 

చిన్న హీరో శర్వానంద్ నానీ సినిమాలను చేసే ఆలోచనలో ఆమె ఉందని అంటున్నారు. నిఖిల్ సినిమాలో ఆమె ఒక  కీలక పాత్ర చేసే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే ఆమె నానీ సినినిమాలో విలన్ గా నటించే అవకాశం ఉందని నితిన్ సినిమాలో కూడా ఆమె విలన్ గా చేసే సూచనలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఆమెకు విలన్ గా అవకాశం ఇవ్వడానికి దర్శక నిర్మాతలు చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. ఆమె కూడా భారీగా డిమాండ్ చేయడం లేదని సమాచారం. అగ్ర హీరోల సినిమాల్లో కూడా ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి. 

 

ఏ సినిమాలో చేస్తుందో గాని వార్తలు మాత్రం ఎక్కువగానే వస్తున్నాయి. రంగస్థలం సినిమా తర్వాత ఆమెకు కొన్ని పాత్రలకు డిమాండ్ బాగా వచ్చింది అని అంటున్నారు. ఆమె ఏ సినిమాలో చేస్తుంది అనేది చూడాలి. ఇక రేష్మీ కూడా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు వీరికి మంచి క్రేజ్ ఉంది టాలీవుడ్ బుల్లి తెర మీద. ఆమెకు విలన్ గానే కాకుండా తల్లి గా కూడా అవకాశాలు వస్తున్నాయి అని అంటున్నారు. త్వరలోనే ఆమె చేసే సినిమాల మీద అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం. చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: