పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుండె చాలా జాలిగుండె అని చాలా సందర్భాలలో చేసిన ఆయన సహాయం పట్ల అందరికీ అర్థమవుతుంది. సామాన్యుల కష్టాలను చూసి చలించిపోయి... తన కష్టాలు గా భావించి పవన్ కళ్యాణ్ బాధపడిన సందర్భాలు ఆయన జీవితంలో కోకొల్లలు. అలాంటి పవన్ కళ్యాణ్ తన చుట్టూ ఉండే మనుషుల బాగోగులు చూసుకుంటూ మరోపక్క సమాజానికి కూడా ఏదో రూపంలో ఉపయోగపడుతున్నారు. ఈ క్రమంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి తాను చూడాలనుకున్న సమాజం కోసం పార్టీని స్థాపించి ప్రస్తుతం మెల్లగా రాణిస్తున్నాడు. ఇటువంటి సందర్భంలో తన పార్టీకి అండగా ఉన్నా రవితేజ సినిమాల నిర్మాత మరియు సేహితుడు రామ్ తాళ్లూరి నీ ఆదుకోవటానికి పవన్ కళ్యాణ్ రెడీ అయినట్లు ఫిలింనగర్ లో టాక్.

 

పూర్తి మేటర్ లోకి వెళ్తే రామ్ తాళ్లూరి రవితేజ తో నేలటికెట్టు, డిస్కోరాజా లాంటి చిత్రాలని నిర్మించడం జరిగింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడ్డాయి. తనకు పొలిటికల్ గా సహాయం చేస్తూ స్నేహితుడిగా ఉన్నా రామ్ తాళ్లూరి ఇప్పుడు ఆర్థికంగా పూర్తిగా నష్టాలపాలయ్యారు. ఇటువంటి సమయంలో కాటమరాయుడు ఫేమ్ కిషోర్ కుమార్ పార్దసాని(డాలీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్సినిమా చేసే అవకాశం ఉందట. దీంతో ఈ సినిమాను నిర్మించే ఈ అవకాశాన్ని పవన్ తన స్నేహితుడు రామ్ తాళ్లూరికి ఇచ్చారట.

 

ఎన్నారై బిజినెస్ మ్యాన్ గా రామ్ తాళ్లూరి గుర్తింపు తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీకి గత ఎన్నికల టైంలో ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్నారు. దీంతో తన స్నేహితుడు కష్టాల్లో ఉండటంతో పవన్ కళ్యాణ్ ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్. మరోపక్క పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో అదే విధంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా సినిమాలు ఒకే చేయటం మనకందరికీ తెలిసిందే. ఈ రెండు సినిమాలు అయిన వెంటనే రామ్ తాళ్లూరి నిర్మించబోయే సినిమా లో పవన్ నటించనున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: