తెలుగు సినీ సీమ హీరోయిన్లకు పెట్టింది పేరు. ఎక్కడ నుంచో ఇక్కడికి వచ్చి రాత్రికి రాత్రే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న వారు ఎందరో ఉన్నారు. వారంతా  ఇతర భాషలకు చెందిన వారే. వారి గురించి ఏమీ తెలియకపోయినా, మన భాష కాకపోయినా కూడా ఎంతో ఆదరించి అక్కున చేరుకుంటోంది టాలీవుడ్.

 

ఇక ఆడియన్స్ కూడా పరభాషా  హీరోయిన్లకు పెద్ద పీట వేసి వారికి కో అంటే కొండ మీద కోతికి తీసుకువస్తున్నారు. అయితే ఇపుదు కరోన వైరస్ పుణ్యమాని లాక్ డౌన్ వచ్చిపడింది. దాంతో సినీ సీమ గందరగోళంలో పడింది. ఈ పరిణామాలతో తెలుగు సినిమా జాతకం ఏంటో ఎవరికీ అర్ధం కావడంలేదు. 

 

ఇటువంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో సినిమాలకు కష్టకాలమని సినీ పెద్దలు అపుడే చెబుతున్నారు. ఇక సినిమాలు తీసినా కూడా అందరూ తమ పారితోషికాన్ని చాలా వరకు తగ్గించుకోవాల్సిందేనని కూడా పెద్ద నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు లాంటి వారు కూడా క్లారిటీగా తేల్చి  చెప్పేస్తున్నారు.

 

ఈ నేపధ్యంలో టాలీవుడ్ లో బాగా రెమ్యునరేషన్ ఇస్తారని ఉత్తరాది నుంచి ఇటు వైపుగా ఎగిరిన చిలకలు ఇపుడు వెనక్కు వెళ్తున్నాయని అంటున్నారు. చాలా మంది హీరోయిన్లకు టాలీవుడ్ మీద ప్రేమ కంటే కూడా భారీ రెమ్యునరేషన్, ఇక్కడ మర్యాదలు నచ్చి వస్తూంటారు. దాంతో తమ పాత్ర ఏంటి అన్నది కూడా ఆలోచించకుండా కూడా సినిమాలను ఒప్పుకుంటున్నారు.

 

ఇపుడు సినిమా బొమ్మ తిరగబడేసరికి వారంతా కూడా వద్దు టాలీవుడ్ అంటున్నారుట. తాజాగా ఒక అగ్ర హీరోయిన్ ఒక అగ్ర హీరో సినిమా నుంచి తప్ఫుకోవడానికి ఈ బడ్జెట్  కటింగ్ కూడా ఒక కారణం అంటున్నారు. అంటే టాలీవుడ్లో సిట్యువేషన్ ఎలా ఉన్నా కూడా తమకు పారితోషికంలో కోత పెడితే చేయం అని క్లారిటీగా కొందరు గ్లామర్ భామలు చెప్పకనే  చెప్పేస్తున్నారన్న మాట.

 

మరి దీనికి టాలీవుడ్ కూడా కొత్త మార్గాలు చూసుకుంటోందిట. కొత్త వారిని, వీలైతే తెలుగు వారిని తీసుకోవాలనుకుంటున్నారుట. అదే జరిగితే తెలుగు సినిమాలో తెలుగు అందం కూడా ఇకపైన కనిపించే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి చూడాలి. రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయో.

మరింత సమాచారం తెలుసుకోండి: