టాలీవుడ్ కి లాక్ డౌన్ కొట్టిన దెబ్బ అలా ఇలా లేదుట. ఇప్పటివరకూ బొమ్మనే నమ్ముకుని బతులు బండి వెళ్లదీసిన బడా బాబులంతా ఇపుడు కరోనా మహమ్మారిని శాపాలు పెడుతున్నారుట. ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ తన జాతకాలు రాసి జీవితాలను తల్లకిందులు చేస్తోందని వాపోతున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఆలయాలుగా చెప్పుకునే సినిమా హాళ్ళ పరిస్థితి లాక్ డౌన్ వేళ దారుణంగా ఉందంటున్నారు.

 

రెండు తెలుగు రాష్ట్రాలు కలుపుకుని మొత్తం 1800 సినిమా ధియేటర్లు ఉన్నాయి. ఇందులో మళీప్లెక్స్ లు, సింగిల్ ధియేటర్లు కూడా ఉన్నాయి. మల్టీప్లెక్స్ లకు సినిమా ఆడడంతో  సంబంధం లేకుండా నెలకు కనీసంగా అయిదు లక్షల వరకూ కేవలం మెయింటెనెన్స్ కింద ఖర్చు అవుతుందిట. ఇక సింగిల్ ధియేటర్లకు ఆ ఖర్చు లక్ష నుంచి లక్షన్నర దాకా అవుతుందిట.

 

ఇక ఒక్కో ధియేటర్లో కనీసంగా పదిహేను నుంచి ఇరవై మంది దాక సినిమా హాళ్ళ స్టాఫ్ ఉంటారు. వీరంతా ప్రతీ శుక్రవారం ఆశగా చూస్తారు. బొమ్మ బాగుండి హిట్ అయితే కొన్నాళ్ళు కధ నడుస్తుందని సంబర పడతారు. ఇక సంక్రాంతి, దసరా, సమ్మర్ సీజన్లు సినిమా హాళ్ళకు పండుగనే తెస్తాయి. అటువంటి  సినిమా తెరకు ఇపుడు ఒక్కసారిగా  కత్తెర పడిపోయింది.

 

ఇకపైన సినిమా హాళ్ళు తెరుస్తారా, తెరచినా ఎలా ఉంటుందో పరిస్థితి అని అంతా బెంగ పడుతున్నారు. కరోనా మహమ్మరికి వ్యాక్సిన్ కనుగొనేంతవరకూ సామాజిక దూరం పాటించాలి. అంటే ఇపుడు ఉనన్ సినిమా హాళ్ళలోని సీట్లను సగానికి సగం తగ్గించేసి టికెట్లు అమ్మాలి. అదే విధంగా సినిమా హాళ్ల ముందు ధర్మల్  స్క్రీనింగ్ పెట్టాలి. ఇక ఎప్పటికపుడు శానిటైజన్ తప్పనిసరి.

 

అంటే ఖర్చు మరింతగా పెరుగుతుంది అన్న మాట. ఇక సినిమా హాలు ఇపుడు సగం నిండితే ఫుల్ అయినట్లు. అయినా సరే టికెట్ల రేట్లు పెంచకూడదు. పెంచితే వచ్చే జనం కూడా ఆగిపోతారు. అంటే నష్టానికి బొమ్మ ఆడించాల్సిన పరిస్థితులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: