కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందిన ‘కేజీఎఫ్‌' పాన్‌ ఇండియన్‌ చిత్రంగా అన్ని భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నది. రాఖీ భాయ్‌గా యష్‌ పాత్ర చిత్రణతో పాటు హీరోయిజాన్ని పతాక స్థాయిలో ఆవిష్కరించిన తీరు అభిమానుల్ని మెప్పించింది. సౌత్ ఇండియాలో బాహుబలి తర్వాత హిందీలో సత్తా చాటిన సినిమా కేజీఎఫ్ నిలిచిపోయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మాఫియా కథాంశంతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కన్నడ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అదే స్థాయిలో కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. ఇక ఈ సినిమాతో యష్ ఏకంగా ఇండియన్ స్టార్ అయిపోయాడు. సౌత్ ఇండియాలో కూడా యష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాకి సీక్వెల్ చాలా రోజులుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హెంబలే ఫిలిమ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మొదటి పార్ట్ కంటే ఎక్కువ బడ్జెట్ తో మరింత గ్రాండ్ గా ఆవిష్కరిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇందులో నెగిటివ్ రోల్స్ లో సంజయ్ దత్, రవీనా టాండన్ నటిస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో హిందీలో కూడా కేజీఎఫ్ 2 పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సౌత్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమాలని హిందీలో రిలీజ్ చేస్తున్న బడా నిర్మాత కరణ్ జోహార్సినిమా రిలీజ్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. కేజీఎఫ్ 2 సినిమా సృష్టించిన సంచలనాన్ని హీరో యష్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని కరణ్ ముందుకొచ్చినట్లు టాక్ వినబడుతోంది. ఇతర బాషలలో రూపొందిన బెస్ట్ సినిమాల హిందీ హక్కులను సొంతం చేసుకోవడానికి కరణ్ ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారు. యష్ క్రేజ్ ని కాష్ చేసుకునే పనిలో పడ్డ కరణ్ జోహార్ హిందీ మార్కెట్ బాగుంటే అతని బాలీవుడ్ కి పరిచయం చేయడంపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి తెలుగులో విడుదల చేయబోతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే దసరా సందర్భంగా అక్టోబర్‌ 23న ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: