ఇప్పుడు కరోనా లాక్ డౌన్ లో చాలా మంది ఖాళీ గా ఉన్న హీరోలు ఇప్పుడు కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నారు. అభిమానులను అలరించే ప్రయత్నాలు చేస్తున్నట్టు అర్ధమవుతుంది. యువ హీరోలు అందరూ కూడా ఏదోక ఛాలెంజ్ ని మొదలుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. సందీప్ రెడ్డీ వంగా మొదలుపెట్టిన ఛాలెంజ్ కి మంచి స్పందన వచ్చింది. సందీప్ మొదలుపెట్టిన బీ ది రియల్ మెన్ ఛాలెంజ్ కి యువ హీరోలు దర్శక నిర్మాతలు చాలా బాగా స్పందించారు. దీనికి సోషల్ మీడియాలో వచ్చిన ఆదరణ చూసి బాలీవుడ్ లో కూడా మొదలుపెట్టారు కొందరు. 

 

ఇక తమిళంలో కూడా దీనికి మంచి ఆదరణ వచ్చిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ జనాలు ఇప్పుడు కొత్త చాలెంజ్ ని మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు అని తెలుస్తుంది. తమ తమ సొంత ఊర్లలో కొందరు హీరోలు సరుకులను పంచె చాలెంజ్ ని చేస్తున్నట్టు సమాచారం. యువ హీరోలు అందరూ కూడా ఈ ఛాలెంజ్ ని మొదలుపెడుతున్నట్టు సమాచారం. త్వరలోనే దీన్ని ఆచరణ లోకి తీసుకుని వచ్చి పేదలకు అండగా నిలబడే ప్రయత్నాలు చేస్తున్నారని టాలీవుడ్ జనాలు అంటున్నారు మరి ఈ ఛాలెంజ్ ని ఎవరు తీసుకుంటారు అనేది చూడాలి. 

 

ప్రస్తుతం ఖాళీ గా ఉన్న హీరోలు తమ సొంత ఊర్లలో కొందరు టీం లను ఏర్పాటు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిధులు అన్నీ కూడా వాళ్ళ ద్వారా అందించే యోచనలో ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం తెలుగులో అందరు హీరోలు అందరు కూడా ఇప్పుడు భారీగా నిధులు తమ తమ గ్రామాల కు ఇవ్వడానికి ఒక ప్లాన్ ని రెడీ చేస్తున్నారు. త్వరలోనే అందించే కార్యక్రమం చేయడానికి అన్నీ సిద్దం చేస్తున్నారు. కొంత నగదు కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్  సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: