హీరోహీరోయిన్లు వెండితెరపై కాకుండా రియల్ లైఫ్ లో ఎక్కడైనా కలిసి కనిపిస్తే చాలు ఇంకేమైనా ఉందా. కెమెరాలు ఊరుకుంటాయా. వెంటపడి మరీ క్లిక్ క్లిక్ మనిపించవూ. గాసిప్పురాయుళ్లు అపుడే తన రాతలకు పనిచెప్తారు. తెలిసిందీ తెలియనిదీ కల్పించి.. మాంచి మసాలా దట్టించి నెటిజన్ల బుర్రలకు లేనిపోని అనుమానాలు కలిగేలా న్యూస్ క్రియేట్ చేస్తారు. కీప్యాడ్ లు అరిగిపోయే వరకు రాతలు రాస్తుంటారు. అలాంటిది లాక్ డౌన్ మొత్తం హీరోహీరోయిన్లు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారంటే ఇంక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కావాల్సినన్ని కథలు రాస్తారు. ఇప్పుడు బాలీవుడ్ భామలు భాయిజాన్, శ్రీలంకన్ బ్యూటీ గురించి ఇలాంటి కథనాలే వినిపిస్తున్నాయి. 

 

సల్మాన్ ఖాన్ ఎక్కువగా వివాదాలతోనే ఫ్రెండ్ షిప్ చేస్తుంటాడు. ఆయన చాలా సున్నితం అని అంటారు బాలీవుడ్ జనాలు. ఒక్కసారి మన అని సల్మాన్ ఖాన్ అనుకున్నాడంటే వాళ్ల కెరీర్ ను ఇతనే బిల్డ్ చేస్తాడని అంటారు. అందుకే చాలామంది సల్మాన్ తో స్నేహం కోసం ట్రై చేస్తుంటారు. అయితే ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సల్మాన్ ఖాన్ రిలేషన్ గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు నెటిజన్లు. 

 

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ లో ఉంటోంది. మార్చి లాస్ట్ వీక్ లో వీకెండ్ హాలిడేస్ కు సల్మాన్, జాక్వెలిన్ మరికొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి ఫామ్ హౌస్ కు వెళ్లారు. అయితే ఆ తర్వాతి రోజు నుంచే లాక్ డౌన్ విధించడంతో అందరూ ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. 150ఎకరాలతో చోటా జంగిల్ లా ఉండే ఈ ఫామ్ హౌస్ లోనే గడుపుతున్నారు. దీనిపైనే కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ముంబయి కాంక్రీట్ జంగిల్ లో ఉండే జాక్వెలిన్ ఫెర్నాండేజ్.. సల్మాన్ ఫామ్ హౌజ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. నేచర్ కు దగ్గరగా ఉన్నానని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: