టాలీవుడ్ లో ఇప్పుడు సునీల్ ఒక మంచి సినిమా చేయడానికి గానూ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో కమెడియన్ గా మంచి సినిమాలు చేసిన తారక్ ఇప్పుడు ఒక మంచి సినిమా వచ్చినా చాలు అనే భావన లో ఉన్నారు. అగ్ర హీరోలతో సమానం గా సినిమాలు చేసిన సునీల్ ఇప్పుడు ఒక్క సినిమా కూడా చేయలేక ఇబ్బంది పడుతున్నాడు ఎన్టీఆర్ హీరో గా వచ్చిన అరవింద సమేత సినిమాలో సునీల్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రాబోయే సినిమాల్లో కూడా త్రివిక్రమ్ అవకాశం ఇవ్వాలి అని భావిస్తున్నట్టు సమాచారం. 

 

ఇప్పుడు ఎన్టీఆర్ తో చేసే సినిమాకు కూడా సునీల్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. కథ పూర్తిగా సిద్దమైన ఈ సినిమాకు సునీల్ పాత్రకు సంబంధించి కసరత్తు చేస్తున్నాడని పూర్తి స్థాయి కమెడియన్ గా అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా ఈ ఏడాది ఆగస్ట్ తర్వాత సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సునీల్ ఇప్పుడు ఈ సినిమా కోసం భారీగా డిమాండ్ చేయడం లేదని తాను కమెడియన్ గా అవకాశాల కోసం చూస్తున్నాడు అని... 

 

ఈ తరం ప్రేక్షకులకు కామెడి పెద్దగా అవగాహన లేదు అనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా తో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే.. ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ఆ సినిమాను చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేస్తారు. సునీల్ ఈ సినిమాలో పాత్రకు సంబంధించి చర్చలు జరుపుతున్నాడని అంటున్నారు. త్రివిక్రమ్ నానీ తో కూడా సినిమా చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి చేస్తాడా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: