గుణశేఖర్ తీసింది తక్కువ సినిమాలైనా తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడు అన్న పేరును సంపాదించుకున్నారు. బాల రామాయణం తీసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. అంతమంది చిన్న పిల్లలతో సినిమా తీయడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. కాని గుణశేఖర్ ఈ సినిమాని ఎంతో ప్రేమించి తీశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన మనోహరం కూడా మంచి సినిమాగా పేరు సంపాదించుకుంది. కమర్షియల్ గా సక్సస్ కానప్పటికి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

 

ఇక మెగాస్టార్ చిరంజీవి తో చూడాలని ఉంది, మృగరాజు, మహేష్ బాబు తో ఒక్కడు, అర్జున్, సైనికుడు, అనుష్క తో రుద్రమదేవి వంటి భారీ కమర్షియల్ చిత్రాలు గుణశేఖర్ కి దర్శకుడిగా గొప్ప పేరును సంపాదించి పెట్టాయి. అయితే గుణశేఖర్ తీసిన సినిమాలకి ఒక కథ  దానికి తగ్గట్టు ఖచ్చితంగా సెట్ ఉండాలన్నది ఆయన పట్టుదల సెంటిమెంట్. ఆ సెట్ కూడా కథ లో కీలక పాత్ర పోషిస్తుంది.

 

ఇక ఆయన గత చిత్రం రుద్రమదేవి కూడా భారీ హంగులతో రూపొందించారు. మంచి టెక్నికల్ వాల్యూస్ తో మెస్మరైజ్ చేసే వీ.ఎఫ్.ఎక్స్ తో అద్భుతంగా తెరకెక్కించాడు. చెప్పాలంటే బాహుబలి కి ఏమాత్రం తీసిపోనట్టుగా కష్టపడ్డాడు. కాని ఆశించినంత సక్సస్ ని అందుకోలేపోయింది. కాని దర్శకుడిగా మాత్రం రుద్రమదేవి గుణశేఖర్ ని మరో మెట్టు పైకి తీసుకు వెళ్ళైంది.

 

ఇక గుణశేఖర్ గత సంవత్సరం రానా దగ్గుబాటితో హిరణ్య కశిప సినిమాని ప్రకటించారు. భారీగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో గుణశేఖర్ కూడా భాగస్వామిగా ఉన్నారు. సురేష్ బాబు తో కలిసి గుణశేఖర్ హిరణ్య కశిప సినిమాని నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే కొంతకాలంగా ఈ సినిమా కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం చేయడం మొదలు పెట్టారు.

 

కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సురేష్ బాబు ఈ సినిమా నిర్మించరన్న ప్రచారం మొదలైంది. దాంతో నిర్మాత సురేష్ బాబు వెంటనే స్పందిస్తూ ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని ఈ సినిమా మీద వస్తున్నవన్ని పుకార్లేనని క్లారిటి ఇచ్చారు. అంతేకాదు లాక్ డౌన్ తర్వాత ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ న్యూస్ రానుందని తాజా సమాచారం. 
   

మరింత సమాచారం తెలుసుకోండి: