టాలీవుడ్ యువ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వాస్తవానికి గడిచిన రెండేళ్లుగా కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేక కొంత సతమతం అయిన విషయం తెలిసిందే. అయితే సరిగ్గా అదే సమయంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాని చేయడానికి సిద్దమైన అల్లు అర్జున్ కు, ఫైనల్ గా త్రివిక్రమ్ అలవైకుంఠపురములో సినిమాతో కెరీర్ లోనే అతి పెద్ద విజయాన్ని అందిచడం జరిగింది. మొన్నటి సంక్రాంతి పండుగ సందర్భమగా మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ కొట్టి అటు ఫ్యాన్స్ తో పాటు ఇటు ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందనను రాబట్టింది. 

 

పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ సంస్థలు కలిసి ఎంతో భారీ ఎత్తున నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమాకు యువ సంగీత తరంగం ఎస్ ఎస్ థమన్ అందించిన సాంగ్స్, సినిమాకు ఎంతో గొప్ప మేలు చేకూర్చాయి అనే చెప్పాలి. విశేషం ఏమిటంటే ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని కూడా దాదాపుగా మంచి సక్సెస్ సాధించి శ్రోతల నుండి విశేషమైన స్పందనను రాబట్టడం జరిగింది. ముందుగా సామజవరాగమనా సాంగ్ సృష్టించిన ప్రభంజనాన్ని మరిచిపోకముందే, రాములో రాముల సాంగ్, ఆ తరువాత బుట్టబొమ్మ, ఇలా దాదాపుగా సినిమాలోని సాంగ్స్ అన్ని కూడా మంచి పేరు దక్కించుకున్నాయి. 

 

మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ మూడు సాంగ్స్ ఇప్పటికే 100 మిలియన్లకు పైగా యూట్యూబ్ వ్యూస్ ని దక్కించుకుని దిగ్విజయంగా 200 మిలియన్లకు చేరువ అవుతూ ఉండడం విశేషం. నిన్నటితో బుట్టబొమ్మ సాంగ్ 150 మిలియన్లు సాధించి మరింతగా దూసుకెళుతోంది. ప్రస్తుతం ఆ పాటకు సంబంధించి ట్రెండ్ అవుతున్న టిక్ టాక్, డబ్ స్మాష్ వీడియోల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా రిలీజ్ అయి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా అల సాంగ్స్ ఇంకా తమ ప్రభంజాన్ని మరింతగా పెంచుకంటూ పోతున్న వైనాన్ని చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ సాంగ్స్ టాలీవుడ్ లో ఎప్పటికీ నిలిచిపోయి పెద్ద ట్రెండ్ ని సృష్టించినా సృష్టించవచ్చని అంటున్నారు సినీ విశ్లేషకులు....!!! 

మరింత సమాచారం తెలుసుకోండి: