'కుమారి 21ఎఫ్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే అందరూ తనవైపు చూసేలా చేసుకుంది. కానీ క్రేజీ ఆఫర్స్ మాత్రం తెచ్చిపెట్టలేకపోయింది. అడపా దడపా సినిమాలు చేసుకుంటూ బండి ఈడ్చుకొస్తోంది. అర డజను సినిమాల్లో నటించినా గుర్తింపు రాలేదు. 'ఈడో రకం వాడో రకం', 'ఎక్కడికిపోతావు చిన్నవాడా', నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, అందగాడు, ఏంజెల్, 24 కిస్సెస్ సినిమాల్లో నటించింది. కానీ ఇవేమీ ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదు. ఈ మధ్య నితిన్ హీరోగా నటించిన 'భీష్మ' సినిమాలో ఏ మాత్రం ప్రాధాన్యత లేని గెస్ట్ రోల్ చేసింది. దీంతో ప్రస్తుతం ఛాన్స్ లు లేక గెస్ట్ రోల్స్ కు అండ్ ఐటమ్ సాంగ్స్ కు పరిమితమైంది. పైగా ఇంకో అడుగు ముందుకేసి కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్ తరహాలోనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇప్పటికే 'మస్తిస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది హెబ్బా. ఇప్పుడు వరుసగా వెబ్ సిరీస్ లు చేయడానికి సన్నద్ధం అవుతోంది. 

 

ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా'లో ప్రసారమయ్యే రెండు వెబ్ సిరీస్ లలో హెబ్బా నటించబోతుందట. అలాగే నెట్ ఫ్లిక్స్ కోసం రూపుపొందుతున్న మరో వెబ్ సిరీస్ లోనూ హెబ్బా పటేల్ ఫుల్ బోల్డ్ క్యారెక్టర్ లో నటించనుంది. మరి ఈ వెబ్ ప్రయత్నంతోనైనా హెబ్బా పటేల్ మళ్ళీ క్రేజ్ ను అందుకుంటుందేమో చూడాలి. ‘రెడ్’ సినిమాలో కూడా ఈ హాట్ బ్యూటీ ఐటమ్ సాంగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా హెబ్బా ఈ సాంగ్ కోసం కనిపించబోతుందట. అలాగే ఐటమ్ సాంగ్ తో పాటు గెస్ట్ రోల్ లో కూడా రెడ్ సినిమాలో నటిస్తోందట.  చేసింది. మళ్ళీ రెడ్ సినిమాలో కూడా గెస్ట్ రోల్ లో నటిస్తోంది. మొత్తానికి హీరోయిన్ క్యారెక్టర్స్ కే ఫిక్స్ కాకుండా సైడ్ క్యారెక్టర్స్ అండ్ స్పెషల్ సాంగ్స్ తో హెబ్బా మెరుస్తోంది. మరి ఇలాంటి క్యారెక్టర్లతో హెబ్బా ఎన్ని రోజులు ఇండస్ట్రీలో నెగ్గుకురాగలదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: