టాలీవుడ్ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తన జీవితంలో అత్యధిక కాలాన్ని సినిమాల్లోనే గడపడం జరిగింది. తొంబై ఏళ్ల వయసులో కూడా చివరి సినిమా మనంలో ఎంతో ఉత్సాహంగా నటించిన ఏఎన్నార్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. ఇకపోతే ఆయన చిన్న తనయుడు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముందుగా విక్రమ్ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున, ఆ తరువాత మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ తన టాలెంట్, నటనతో మంచి అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగారు. ఇక కెరీర్ పరంగా ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించి ప్రేక్షకులను, అభిమానులను సంపాదించిన నాగార్జున కు గొప్ప అందగాడు అనే పేరుంది. 

 

ఒకానొక సమయంలో యువతలో నాగార్జునకు ఉన్న క్రేజ్ వేరనే చెప్పాలి. అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణల తరం కొనసాగుతున్న సమయంలో ఎక్కువగా అమ్మాయిల్లో నాగార్జున కు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆ సమయంలో వచ్చిన గీతాంజలి, శివ, హలో బ్రదర్, ఘరానా బుల్లోడు సహా మరికొన్ని సినిమాలు నాగ్ కు యువతలో మంచి పేరు సాధించిపెట్టాయి. ఇక కొన్నాళ్ల క్రితం ఆయన తనయులు ఇద్దరూ కూడా హీరోలుగా టాలీవుడ్ కి హీరోలుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా నాగ్ ఇంకా యంగ్ గానే కనపడుతుంటారు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, కొన్నాళ్ల క్రితం డాన్స్ మాస్టర్ గా కెరీర్ ని ప్రారంభించి ఎన్నో సినిమాలలో సాంగ్స్ కు డాన్స్ కంపోజ్ చేసిన రాకేష్ మాస్టర్, ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించడంతో పాటు మధ్యలో మరికొన్ని మీడియా ఛానల్స్ కు ఇంటర్వూస్ ఇస్తున్నారు. 

 

కాగా ఇటీవల ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ, నాగార్జున స్వతహాగా అందగాడు కాదని, మొదటి నుండి ఆయనను అందగాడు అని కొందరు అనడం స్టార్ట్ చేసిన తరువాత మెల్లగా అందరూ అలవాటుపడి అందగాడు, మన్మధుడు అనడం స్టార్ట్ చేసారని, మెల్లగా రోజూ తింటుంటే చేదు కూడా రాను రాను ఇష్టంగా మారినట్లుగా పెద్దగా అందగాడు కాని నాగార్జునను అందగాడు అంటూ మనవాళ్ళు పొగడడం విడ్డూరంగా ఉంది అంటూ కామెంట్స్ చేయడం జరిగింది. కాగా ఆయన వ్యాఖ్యల పై ముఖ్యంగా నాగ్ ఫ్యాన్స్ మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. అంత పెద్ద స్థాయి, పేరు ఉన్న హీరోని మీరు ఈ విధంగా అనడం సబబు కాదని వారు రాకేష్ మాస్టర్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: