దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను రీసెంట్ గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమా నుండి రాం చరణ్ పాత్ర కి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమా మీద భారీగా అంచనాలను పెంచాయి. ఇక మే 20 న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రాబోతున్న కొమరం భీం టీజర్ తో ఇక సినిమా ఎలా ఉండబోతుందన్న అంచనాకి రావచ్చని అంటున్నారు.

 

ఇక ఇప్పటికే రిలీజ్ కి సిద్దంగా ఉన్న సినిమాలు ..నాని ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేషన్ లో రిలీజ్ కి రెడీగా ఉన్న వి. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో నివేదా థామస్, సుధీర్ బాబు, అదిథి రావు హైదరీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా తర్వాత రాం పోతినేని కిషోర్ తిరుమల కాంబినేషన్ లో రెడీ అయిన సినిమా రెడ్. ఈ సినిమాని భారీగా నిర్మించారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీతో వస్తున్న వకీల్ సాబ్ కూడా భారీ బడ్జెట్ సినిమా. ఈ సినిమాని మే 15 న రిలీజ్ చేయాలనుకున్నారు దిల్ రాజు. బోనీకపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాని బాలీవుడ్ కోలీవుడ్ సూపర్ హిట్ సినిమాకి రీమేక్ గా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాని ఇప్పట్లో రిలీజ్ చేయలేని పరిస్థితి.

 

ఇలా భారీ బడ్జెట్, మీడియం బడ్జెట్ తో నిర్మించిన సినిమాలని ఈ ఇయర్ ఎండింగ్ వరకు రిలీజ్ చేయడం ఏమాత్రం మంచి నిర్ణయం కాదని ఇప్పటికే స్టార్ ప్రొడ్యూసర్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే చిన్న సినిమాలు నిర్మించి రిలీజ్ కి డేట్ దొరకక ల్యాబ్ కే కొన్ని పరిమితమయి ఉన్నాయి. వాటిని ఇలాంటి పరిస్థితుల్లో ఓటీటీ ప్లాట్ ఫాం లో రిలీజ్ చేయడానికి సరైన సమయమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

 

సినీ విశ్లేషకులు దీన్ని ఏకీభవిస్తున్నారు. మంచి కాన్సెప్ట్ గనక అయితే ఓటీటీ లో వీటికి మంచి డిమాండే ఉంటుంది. పైగా జనాలు చూసే అవకాశం ఇప్పుడు మెండుగా ఉంది. కాబట్టి చిన్న సినిమాలని ఇలా రిలీజ్ చేసెస్తే ఉత్తమం అని కనీసం ఒక్కో సినిమాకి 2-3 కోట్ల వరకు లాభం వస్తుందని అంటున్నారు. మరి ఈ నిర్మాతలందరు ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటే బాగానే లాభపడతారని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: