టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్, ఫ్యాన్స్ గురించి మనకు ప్రత్యేకంగా తెలియనిది కాదు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా చిత్ర సీమకు నటుడిగా రంగప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్, మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుండి, మొన్నటి అజ్ఞాతవాసి వరకు ప్రతి ఒక్క సినిమాతో నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన రేంజ్ ని, క్రేజ్ ని దక్కించుకున్నారు. ఇక ప్రస్తుతం వకీల్ సాబ్ తో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆ తరువాత గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నారు. 

 

ఇక హీరోగా కెరీర్ ప్రారంభించినప్పటి నుండి టాలీవుడ్ లో పవన్ గురించి చాలామందికి తెలుసు. ఇక ఇటీవల ఉత్తేజ్, రవితేజ, సత్యానంద్, జెడి చక్రవర్తి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నటులు పవన్ కళ్యాణ్ గురించి ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది. కేవలం వారు మాత్రమే కాదు ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన వారు, అలానే ఆయనతో కలిసి స్నేహితులుగా ప్రయాణం చేసినవారుతో పాటు, ఆయన సినిమాల్లో నటించిన అనేకమంది పవన్ కళ్యాణ్ వాస్తవానికి రీల్ హీరో మాత్రమే కాదని, అంతకు మించి ఎంతో మంచి మనసున్న రియల్ హీరో అని అంటుంటారు. 

 

ఇక తన సెట్స్ లో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే చలించిపోయి వారికి తనవంతుగా ముందుగా సాయం అందించే పవన్, తన తోటి వారు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటె అస్సలు చూడలేరని, ముందుగా వారికి ఏదైనా సాయం చేయనిదే ఆయనకు మనసు ఊరుకోదని, ఆ విధంగా పలు సందర్భాల్లో పవన్ అనేకమందికి సాయమందించిన ఘటనలు చాలానే ఉన్నాయని పలువురు సినిమా ప్రముఖులు చెప్పడం జరిగింది. వాస్తవానికి రీల్ హీరోలుగా ఎందరు ఉన్నప్పటికీ, మంచి మనసున్న పవన్ కళ్యాణ్ వంటి అక్కడక్కడా కొందరు రియల్ హీరోలు ఎప్పటికీ మన మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు...!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: