విజయ్ దేవరకొండ పేరులోనే విజయం ఉంది దీనికితోడు అతడి సినిమాలు ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ బ్లాక్ బష్టర్ హిట్స్ గా మారడంతో క్రేజీ హీరో స్థాయికి ఎదిగిపోయిన విజయ్ దేవరకొండ డేట్స్ ఇస్తే 10 కోట్ల వరకు పారితోషికం ఆఫర్ చేస్తున్నారు అంటూ గతంలో వార్తలు వచ్చాయి. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండకు వరస ఫ్లాప్ లు రావడంతో ప్రస్తుతం పూరీ జగన్నాథ్ చేస్తున్న ఒక పాన్ ఇండియా మూవీ పై విజయ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు.


ఇలాంటి క్రేజీ హీరో స్థాయిలో కొనసాగుతున్న విజయ్ దేవరకొండకు అప్పులు ఉన్నాయి అంటే ఎవరు నమ్మరు. అయితే తనకు అప్పులు ఉన్నాయి అంటూ స్వయంగా విజయ్ ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్పడం షాకింగ్ న్యూస్ గా మారింది. ఈ నెలలో రాబోతున్న మే 9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో ఇంటర్వ్యూ ఇస్తూ తన అప్పుల విషయం బయటపెట్టాడు. 


వాస్తవానికి తాను ఇప్పటివరకు చాల సినిమాలలో నటించినా తాను ఎప్పుడు తన దగ్గర ఉన్న డబ్బును దాచుకోలేదనీ తనకు పారితోషికంగా వచ్చిన డబ్బుతో ఒక పెద్ద ఇల్లు కొనడమే కాకుండా ఎప్పటికప్పుడు డబ్బు ఖర్చు పెడుతూ ఉండటంతో తన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు తగ్గిన విషయం తనకు కరోనా సమస్యలు మొదలయ్యే వరకు తెలియలేదనీ కామెంట్ చేసాడు. అంతేకాదు అన్ని ఆర్ధిక సమస్యలు వస్తాయని ఎవరైనా ముందు ఊహించుకుంటారా అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు.


తాను మధ్య తరగతి కుటుంబం నుండి రావడంతో మధ్య తరగతి బాధలు ఎలా ఉంటాయో తనకు తెలుసు అనీ అందుకే కనీసం కొందరినైనా ఆడుకుందమాని మిడిల్ క్లాస్ ఫండ్ మొదలు పెడితే దాని లక్ష్యాల పై కొందరు విమర్శలు చేయడం తనకు బాధ కలిగించింది అని అంటున్నాడు. ఈ ఫండ్ కార్యక్రమాల కోసం తాను నిజయితీగా తన దగ్గర డబ్బు ప్రస్తుతం లేకపోయినా అప్పులు చేసి సహాయం చేస్తుంటే తనను టార్గెట్ చేస్తూ కొంతమంది కామెంట్స్ చేయడం తనకు బాధ కలిగింది అని అంటున్నాడు. అయితే తన అప్పుల గురించి తనకు ఏమాత్రం భయంలేదనీ ఒక్కసారి షూటింగ్ లు మొదలైతే తనకు వరస పెట్టి డబ్బులు వస్తాయి కాబట్టి తన మిడిల్ క్లాస్ ఫండ్ కార్యక్రమాలకు అంతరాయం రాదు అని అంటున్నాడు ఈ క్రేజీ యంగ్ హీరో..

మరింత సమాచారం తెలుసుకోండి: