కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ చాలా నష్టపోయింది. ఎక్కడి సినిమాలు అక్కడే ఆగిపోవడంతో ఆర్థికంగా నిర్మాతలు కుదేలైపోయారు. షూటింగ్ పూర్తయి రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాల పరిస్థితి మరీ దారుణ్ంగా తయారయింది. థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి కనిపించకపోవడంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవేళ థియేటర్లు తెరుచుకున్నా మునుపటిలా జనాలు సినిమా చూడడం కోసం వస్తారా అనేది సందేహమే. 

 

థియేటర్లలో భౌతిక దూరం పాటించడం అసాధ్యం. అందువల్ల కరోనా ఉధృతి పూర్తిగా తగ్గాక కానీ థియేటర్లు తెరుచుకోవు. ఈ నేపథ్యమ్లో ఆల్రెడీ రెడీగా ఉన్న సినిమాలకి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ల నుండి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో అమృతరామమ్ అనే సినిమా డైరెక్ట్ ఓటీటీ ద్వారా రిలీజైంది. ఈ సినిమా అంత మంచి స్పందన రాలేదు. నవీన్ చంద్ర హీరోగా నటించిన భానుమతి రామక్రిష్ణ కూడా ఓటీటీలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది.

 

మెల్లమెల్లగా పెద్ద పెద్ద సినిమాలు కూడా డిజిటల్ లో రిలీజ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇస్మార్ట్ శంకర్ మూవీతో హిట్ కొట్టి మాస్ హీరో అనిపించుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్, కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమా చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి డిజిటల్ నుండి భారీ ఆఫర్ వచ్చింది. అయితే రెడ్ సినిమాని డైరెక్ట్ గా థియేటర్లలోనే విడుదల చేస్తామని ఆ ఆఫర్ ని తిరస్కరించారు.

 

అయితే ప్రస్తుతం ఈ సినిమాకి మరో బంపర్ ఆఫర్ వచ్చిందట. అయితే అది డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కోసం కాదు. థియేటర్లలో సినిమా రిలీజ్ అయిన తర్వాత డిజిటల్ హక్కులని కొనుక్కోవడానికి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పోటీ పడుతున్నాయట. నెట్ ఫ్లిక్స్సినిమా కోసం భారీగానే వెచ్చించనుందట. మరి ఈ ఆఫర్ కైనా చిత్ర నిర్మాతలు ఒప్పుకుంటారా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: