కొన్ని సంఘటనలు చూస్తే విధి వెంటాడుతుందన్న విషయం నమ్మాల్సి వస్తుంది. అలా విధి వెంటాడిన సంఘటనలు నందమూరి ఫ్యామిలీలో జరిగాయి. ఈ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడాయి. ఒకటి రెండు కాదే ఏకంగా మూడు సార్లు రొడ్డు ప్రమాదాలు ఈ కుటుంబంలో విషాదం నింపాయి. అయితే ఈ ప్రమాదాల్లో ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయింది నందమూరి కుటుంబం.

 

2009లో తెలుగు దేశం పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించాడు ఎన్టీఆర్. చిన్న వయసుల్లో తాతను తలపించేలా ప్రసంగాలు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు తారక్‌. అయితే ఆ సమయంలో ప్రచారం ముగించుకొని హైదరాబాద్‌ తిరిగి వస్తుండగా ఎన్టీఆర్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్‌ తల, భుజం మీద తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతను చూస్తే ఎన్టీఆర్ ప్రాణాలతో ఎలా బయట పడ్డాడా అన్న ఆశ్చర్యం కలుగుతుంది.

 

తరువాత ఎన్టీఆర్‌ అన్న జానకి రామ్ కూడా రొడ్డు ప్రమాదంలోనే మృతి చెందాడు. సినీ నిర్మాతగా అప్పుడప్పుడే ఇండస్ట్రీలో సెటిల్‌ అవుతున్న జానకి రామ్‌ అర్ధాంతరంగా మరణించటం ఎన్టీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నిపింది. 2014 డిసెంబర్‌లో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళుతుండగా జానకి రామ్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో జానకి రామ్‌ అక్కడికక్కడే మరణించాడు.

 

తరువాత ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ కూడా రొడ్డు ప్రమాదంలోనే మరణించటం ఆ కుటుంబంలో మరింత విషాదాన్ని నింపింది. 2018 ఆగస్టులో హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఒక ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు కావలి వెలుతుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో కారు 160 కిమీ వేగంతో ప్రయాణిస్తున్నట్టుగా అధికారులు అంచనా వేశారు. అతి వేగమే ప్రమాదానికి కారణం అయి ఉంటుందని కూడా వెల్లడించారు. ఇలా ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులకు రోడ్డు ప్రమాదాలు జరగటంతో నందమూరి అభిమానుల్లో కలవరం మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: