రేణుదేశాయ్ బ‌ద్రి సినిమా హీరోయిన్‌. అంతేకాక ప‌వ‌న్‌క‌ళ్యాణ్  మాజీ భార్య‌. అయితే ఆమె ప‌వ‌న్‌తో క‌లిసి ఉన్న‌ప్ప‌టికంటే ఆయ‌న మాజీ భార్య‌గానే ఎక్కువ గుర్తింపు పొందింది. ఆయ‌న నుంచి విడిపోయిన త‌ర్వాతే ఆమె ఎక్కువ‌గా మీడియా వార్త‌ల్లో నిలుచుంది. న‌టిగానే కాకుండా ద‌ర్శ‌కురాలిగా, నిర్మాత‌గానూ త‌న‌లోని విభిన్నమైన కోణాల‌ను బ‌య‌ట‌పెడుతోంది. ఇక పెళ్ళ‌యిన త‌ర్వాత అలాగే ప‌వ‌న్ నుంచి విడిపోయాక కూడా ఆమె పూర్తిగా సినిమాల‌కు దూరంగా ఉండిపోయింది. కంప్లీట్‌గా ఫ్యామిలీకే అంకిత‌మ‌యింది. అయితే ఇటీవ‌ల కొన్ని ఆఫ‌ర్లు రేణూని వెదుక్కుంటూ వెచ్చాయి. కాని ఆమె కొన్ని కార‌ణాల వ‌ల్ల వాటిని తిర‌స్క‌రించింది. ఎందుకో ఆ పాత్ర‌ల్లో న‌టించ‌డానికి పెద్ద‌గా ఆశ‌క్తి చూప‌లేదు. 

 

అయితే ఇప్పుడు మ‌ళ్లీ రేణూకి న‌ట‌న‌పై ఆశ‌క్తి పెరిగింది. ఎలాంటి పాత్ర‌ల‌కైనా తాను సిద్ధ‌మేనంటూ చెబుతోంది. ఆఖ‌రికి త‌ల్లి పాత్ర‌ల‌కు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. త‌నది త‌ల్లి పాత్ర‌లు చేసే వ‌య‌సు కాక‌పోయిన‌ప్ప‌టికీ చేస్తానంటోంది. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో ఉన్న  యువ క‌థానాయ‌కుల‌కు త‌ల్లిగా న‌టించ‌డానికి త‌న‌కు ఎటువంటి  అభ్యంత‌రం లేదంటోంది. అయితే త‌ల్లి పాత్ర‌ల‌ని మ‌రీ ముస‌లమ్మ‌గా చూపిస్తే చేయ‌న‌ని, త‌ల్లి పాత్ర‌ల్నీ స్టైల్ గా తీర్చిదిద్ద‌గ‌లిగే ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేస్తాని అంటోంది రేణు. 

 

అయితే నిజానికి తెలుగులో త‌ల్లి పాత్ర‌ల‌కు మంచి డిమాండ్ ఉందిప్పుడు. అత్త‌, వ‌దిన‌, పిన్ని ఇలా ఏ పాత్ర‌లకు కాస్త ఫాలోయింగ్ ఉన్న న‌టీమ‌ణుల కోసం ద‌ర్శ‌క నిర్మాత‌లు అన్వేషిస్తున్నారు. వాళ్లంద‌రికీ రేణూ మంచి ఛాయిస్ అనే చెప్పుకోవాలి. అందానికి అందం అభిన‌యం అన్నీ ఉంటాయి. అందులోనూ ఇప్పుడు ఆమె అలాంటి పాత్ర‌ల్లో న‌టించ‌డానికి కూడా ఒప్పుకుంది కాబ‌ట్టి మ‌రి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆమెకు త‌గిన క్యారెక్ట‌ర్స్ రాయ‌డ‌మే ఇక లేటు అని చెప్పాలి. అలాగే రేణు కొడుకు అఖిరానంద‌న్ కూడా హీరోగా ప‌రిచ‌యం చెయ్యాల‌ని ఆమె కోరిక. అయితే అఖిరాను ఎలా ఇంట్ర‌డ్యూస్ చేస్తారు. ఏమా క‌థ అన్న‌ది వేచి చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: