కరోనా వైర‌స్‌ మహమ్మారి కారణంగా ప్రపంచమంతా లాక్‌డౌన్‌కి వెళ్ళిపోవ‌డంతో ఒక్క‌సారిగా  ఆర్థిక వ్యవస్థకు చాలా పెద్ద గట్టి దెబ్బ తగిలింది. ఈ లాక్‌డౌన్‌తో ఎన్నో రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. వాటిలో సినిమా రంగం కూడా ఒకటి. అయితే సినీ రంగానికి మాత్రం చాలా పెద్ద దెబ్బే త‌గిలింద‌ని చెప్ప‌వ‌చ్చు. రెండు నెలలపాటు థియేటర్లు మూతబడటం, సినిమా షూటింగ్‌లు ఆగిపోవడం అనే పరిణామాలు ఇప్ప‌టివ‌ర‌కు కూడా ఎవ్వరూ ఊహించి ఉండరు. అసలు మళ్లీ సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా తెలియని పరిస్థితి ఏర్ప‌డింది. జూన్‌లో దేశ వ్యాప్తంగా పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తివేసినా థియేటర్లకు జనాలు వచ్చే పరిస్థితి ఉండదు. థియేట‌ర్ల‌కు జనాలు వ‌చ్చి సినిమాలు చూడాలంటే కాస్త టైమ్ ప‌ట్టేట‌ట్టే ఉంది. ఈ పరిస్థితి నుంచి టాలీవుడ్ కోలుకోవాలంటే మరో రెండు మూడు నెలలు పట్టొచ్చు.

 

ఇప్పటికే సిద్ధమైన సినిమాలు విడుదలకాక, ఆ విడుద‌ల‌కోసం వెయిట్ చేస్తున్నాయి. మ‌రికొన్ని కొత్త సినిమాలు అప్పుడే థియేటర్లలోకి రాకపోవడం వల్ల ముఖ్యంగా నష్టపోయేది నిర్మాతలు. వాళ్లు బాగుంటేనే కదా సినీ పరిశ్రమ బాగుంటుంది. అలాగే ఎన్నో సినిమాలు షూటింగ్‌లు మ‌ధ్య‌లోనే ఆగిపోయాయి.  కాబట్టి వాళ్లను, సినీ పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత స్టార్ హీరోలపై ఉందంటున్నారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ డి.సురేష్ బాబు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న పరిస్థితులు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...ఈ విధంగా స్పందించారు. టాలీవుడ్‌ బాగుండాలంటే కొన్నింటిని వదులుకోక తప్పదని స్టార్ హీరోలను ఉద్దేశించి అన్నారు.

 

ఇక  థియేటర్లలో సినిమా చూడటం అనేది సమాజ శ్రేయస్సుకు ముడిపడి ఉన్న విష‌యం కాబ‌ట్టి. లాక్‌డౌన్ ఎత్తేసిన తరవాత కూడా థియేటర్లు తెరవకపోవచ్చు. దీని వల్ల చాలా నష్టాలు సంభవించే కార‌ణాలు ఎన్నో ఉన్నాయి.  ఆఖరికి స్టార్ హీరోలను రెమ్యునరేషన్ తగ్గించుకోమని అడగొచ్చు. ఒక కంపెనీ న‌ష్టాల్లో ఉందంటే ఉద్యోగుల వేత‌నాల్లో ఎలాగైతే కోత ప‌డుతుందో ఆ ర‌క‌మైన‌దే. ఉదాహ‌ర‌ణ‌... ఇది కంపెనీ నష్టాలను పూడ్చడానికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల వేతనాల్లో కోత వేయడం వంటిదే’’ అని సురేష్ బాబు తెలిపారు. కాబట్టి లాక్‌డౌన్ ఎత్తివేసిన తరవాత నటులు, దర్శకులు వారి రెమ్యునరేషన్స్ తగ్గించుకుంటే బావుంటుందని ఆయ‌న అభిప్రాయాన్ని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: