అసలు మనం ఎవరం?... నీ నూనె నీ నూనె నా నూనే నా నూనె... నీ నవరంధ్రాల్లోను మైనం కూరతానురా తలకు మాసిన కుంకా... లాంటి ఎన్నో నవ్వు పుట్టించే డైలాగులను చెప్పి మనం అందరినీ కడుపుబ్బ నవ్వించిన సుత్తి వీరభద్రరావు అస్సలు పేరు మామిడిపల్లి వీరభద్ర రావుకు నాటకాలంటే మిక్కిలి ఇష్టం. ఆ ఇష్టంతోనే సినీ రంగంవైపు అడుగులు వేసిన ఆయన తెలుగు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశారు. 1985లో జంధ్యాల తెరకెక్కించిన బాబాయ్ అబ్బాయి సినిమా లో హీరో బాలకృష్ణ కి బాబాయ్ పాత్రలో నటించిన సుత్తి వీరభద్రరావుకు మంచి పేరు దక్కింది. తన జీవితంలో మయూరి, గాంధీనగర్ రెండవ వీధి, స్వాతిముత్యం లాంటి సూపర్ హిట్ సినిమాలతో పాటు 40 సినిమాలకు పైగా నటించిన సుత్తి వీరభద్రరావు చాలా దయనీయమైన స్థితిలో మరణించారు.


జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి కి స్నేహితుడు అయిన వీరభద్ర రావు... ఆయన రచనలో, దర్శకత్వంలో తెరకెక్కిన ఎన్నో హాస్య కథా సినిమాల్లో నటించారు. బ్రహ్మానందం తో కూడా కలిసి సుత్తి వీరభద్రరావు నటించి తెలుగు సినీ ప్రేక్షక అభిమానుల లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 1971 సంవత్సరంలో ఆలిండియా రేడియోలో జాయిన్ అయిన సుత్తి వీరభద్ర రావుకి సినీ అవకాశాలు ఎక్కువగా రావడంతో 1982వ సంవత్సరంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా సినిమాలకే తన జీవితాన్ని అంకితం ఇచ్చారు. కాగా 1989 వ సంవత్సరంలో ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు ఈయన.

 

ఆ కాలంలోనే తీవ్ర అనారోగ్యానికి గురై కేవలం నలభై నాలుగు సంవత్సరాలకే తన తుది శ్వాస విడిచారు. ఇతనికి ఇద్దరు పిల్లలు ఉండగా వారిలో ఒకరు అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. వీరభద్ర రావు కుమార్తె కూడా అర్ధాంతరంగా చనిపోయారు. ప్రస్తుతం ఆయన కుమారుడు బాగానే సెటిల్ అయ్యాడు. వీరభద్ర రావు కాలం చేసే సమయానికి నాలుగు లక్షల అప్పు ఉంటే... ఆ అప్పులన్నీ తన భార్య తీర్చుకుందట. ఏదేమైనా అందరినీ నవ్వించిన సుత్తి వీరభద్రరావు 44కే చనిపోవడానికి ఎన్ని పరిశ్రమకు పెద్ద లోటుగా చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: