మొదటి సినిమా హిట్ అయిందంటే వరుసగా అవకాశాలు వచ్చేస్తుంటాయి. సినిమా ఇండస్ట్రీలో మొదటి అవకాశం రావడమే గగనం. ఆ అవకాశం వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత వెనువెంటనే అవకాశాలు వచ్చేస్తుంటాయి. కానీ ఆర్ ఎక్స్ ౧౦౦ దర్శకుడు అజయ్ భూపతి పరిస్థితి మరోలా ఉంది. కార్తికేయ హీరోగా నటించిన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

 

 

సినిమా విజయం తరువాత అజయ్ భూపతి రేంజ్ మారిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. మొదటి సినిమా కంటే రెండవ సినిమాకే ఎక్కువ కష్టాలు పడుతున్నాడు. రెండవ సినిమా మహాసముద్రం స్క్రిప్టు పూర్తయ్యాక రవితేజ, ఈ సినిమాలో హీరోగా కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో తెలియదు రవితేజసినిమా నుండి తప్పుకున్నాడు. 

 

 

అప్పుడు ఈ కథ నాగచైతన్య వద్దకి వెళ్ళింది. నాగచైతన్య ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల టైమ్ ఇవ్వలేకపోయాడు. చివరికి శర్వానంద్ వద్దకి చేరుకుంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో మరో హీరోగా సిద్ధార్థ్ ని తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుత సమాచారం ప్రకారం సిధ్ధార్థ్ ఈ సినిమాలో కనిపించడట.

 

 

సిద్ధార్థ్ స్థానంలో మరో యంగ్ హీరోని తీసుకోనున్నట్లు చెబుతున్నారు. మల్టీస్టారర్ సినిమాలని మళ్లీ ముట్టుకోనని చెప్పిన అజయ్ భూపతి, ఈ సినిమాని చాలా కొత్తగా తెరకెక్కిస్తాడట. ఇప్పటి వరకూ మనం తెరమీద చూడని కాన్సెప్ట్ తో చాలా వైవిధ్యంగా ఉండనుందట. సినిమా కథాంశంతో పాటు, కథనం చాలా ఫ్రెష్ గా ఉండనుందని అంటున్నారు. సినిమాలో సెకండ్ హీరో చనిపోతాడట. దాంతో సినిమా మొత్తం ఎమోషనల్ గా మారనుందని అంటున్నారు.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: