తెలుగు సినిమా అయినా తమిళ సినిమా అయినా సరే కొందరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ రెండు భాషల్లో నటించిన నటులు అటు తమిళనాడు లో ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి పరిచయమే. అక్కడి వారికి ఇక్కడ ఆదరణ లభించింది ఇక్కడి వారికి అక్కడ ఆదరణ లభించింది. అక్కడి నటులకు ఇక్కడ మంచి గుర్తింపు వచ్చింది. కొందరు నటులు తమిళనాడు లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు మన తెలుగు వారు. వారిలో ప్రత్యేకంగా చెప్పుకునేది విశాల్ గురించి. ఆయన వాస్తవానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి. 


కాని తమిళంలో సినిమాల మీద ఉన్న ఆసక్తి తో ఆయన అక్కడికి వెళ్లి నటించి హీరో అవ్వడం అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకోవడం స్టార్ హీరోగా నిలబడటం వంటివి జరిగాయి. అయితే ఆయనకు కెరీర్ తొలి రోజుల్లో బాగా అవమానాలు ఎదురు అయ్యాయి అని చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని ఆయనకు అవమానాలు మాత్రం అక్కడ ఎదురు అయ్యాయి అని చెప్తారు. ఆయన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి అని ఇక్కడ వద్దు అని కొందరు దర్శక నిర్మాతలు ఆయన్ను కెరీర్ తొలి రోజుల్లో అవమానించారు. 


తమిళ  భాషను ఎంత ప్రేమించినా సరే అక్కడ మాత్రం ఆయన్ను అవమానించారు కొందరు. ఆయన అక్కడి సినిమాల్లో ఆ తర్వాత నిలబడి స్టార్ హీరో కూడా అయ్యారు. అయినా సరే కెరీర్ తొలి రోజుల్లో ఆయనకు ఎదురైన అవమానాలు మర్చిపోలేరు అని కొందరు అంటారు. మన తెలుగు వాళ్ళు అంటే తమిళంలో కొంత అవమానం చిన్న చూపు ఉంటుంది. అందుకే చాలా మంది మన తెలుగు హీరోలు అక్కడ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించే వారు కాదు అని చెప్తూ ఉంటారు. కాని విశాల్ అక్కడ నిలబడి మంచి హీరో అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: