కళామతల్లికి నిలువెత్తు రూపం ఆయన... దర్శకుడిగా నిర్మాతగా రచయితగా పాటల రచయితగా ఓ గొప్ప నటుడిగా... తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం. దర్శకుడిగా 150 సినిమాలకు పైగా తెరకెక్కించి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించాలన్న అది ఆయనకే సొంతం... 250కి పైగా సినిమాలకు రచయితగా పాటల రచయితగా పనిచేసి అక్కడ సత్తా చాటాలన్న ఆ  మహానుభావుడి కే సాధ్యం.... తెలుగు చిత్ర పరిశ్రమకు ఖ్యాతిని  ఎంతగానో పెంచిన గొప్ప వ్యక్తి ఆయన.... తెలుగు చిత్ర పరిశ్రమలో  ప్రేక్షకులు ఎన్నడూ మరువని  మైలురాళ్ళు లాంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకత్వ నైపుణ్యం ఆయన సొంతం....పోరుబాట సినిమాలనుంచి లవ్ స్టోరీ ల వరకు.. కుటుంబ కథా చిత్రాల నుంచి భగ్నప్రేమ ల వరకు ప్రతి ఒక్క నేపథ్యం ఉన్న సినిమా ఆయన దర్శకత్వంలో వచ్చింది.ఆ  మహానుభావుడు ఇంకెవరో కాదు దాసరి నారాయణరావు. 

 

 

 తెలుగు చిత్ర పరిశ్రమకు ఖ్యాతిని  ఎంతగానో పెంచి దర్శకుడిగా నిర్మాతగా రచయితగా పాటల రచయితగా ఇలా అన్ని విభాగాలు తన సత్తా చాటుతూ కళామతల్లి ముద్దుబిడ్డ గా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారు దాసరి నారాయణరావు. 1947 మే 4వ తేదీన జన్మించిన దాసరి నారాయణరావు చిన్నప్పటి నుంచే నాటకాల లో ఎంతో ఆసక్తి కనబరిచేవారు. 18 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడే నాటకాలు ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించి దర్శకుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించడమే కాదు 50పైగా  సినిమాలను స్వీయనిర్మాణంలో నే రూపొందించారు. కుటుంబ కథా చిత్రాలతో పాటు దొరల పాలన అణగదొక్కే  రాములమ్మ లాంటి సినిమాలను తెరకెక్కించి చరిత్రలో నిలిచిపోయే మైలు రాళ్ళ లాంటి సినిమాలను అందించారు. ప్రస్తుతం స్టార్ హీరోలు గా కొనసాగుతున్న ఎంతోమంది దర్శకరత్న దాసరి నారాయణరావు దగ్గర రాటుతేలిన వారే. 

 

 ఇలా ఎన్నో దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు చేశారు  దాసరి నారాయణరావు. ఇప్పటికి ఎంతో మంది దర్శకులకు ఆయన ఆదర్శం. కాగా సరిగ్గా 2017 మే 30 వ తేదీన తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నిండిపోయిన రోజు. ఎందుకంటే కళామ్మ తల్లి ముద్దు బిడ్డ అయిన దాసరి నారాయణరావు పరమపదించిన రోజు. తెలుగు చిత్రపరిశ్రమ మొత్తం విషాదంలో మునిగి పోయిన రోజు. కళామతల్లి బిడ్డగా ఎన్నో ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో తన సేవలు అందించిన దాసరి నారాయణ రావు ఇకలేరు అనే నిజాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేక పోయింది. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు అని ఎంతో మంది ప్రముఖులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా అలాంటి కళామతల్లి ముద్దుబిడ్డ ఎందరికో ఆదర్శప్రాయమైన మహోన్నత వ్యక్తి సేవలను ఆయన పుట్టినరోజు రోజు సందర్బంగా  గుర్తు చేసుకుంటూన్నారు సినీ ప్రముఖులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: