వరంగల్ జిల్లా మహబూబ్ నగర్ మండలం లో జన్మించిన చక్రి అలియాస్ చక్రధర్ తన సంగీతంతో తెలుగు పరిశ్రమ ని ఒక ఊపు ఊపారు. సంగీతం అందించడంతో పాటు పాటలు పాడడం, రాయడం లో ఈయనకు ఈయనే దిట్ట అని చెప్పవచ్చు. నటుడిగా కూడా అనేక సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అందరిని బాగా అలరించాడు. జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అంటూ ప్రభాస్ హీరోగా నటించిన చక్రం సినిమాలో తన సత్తా ఏంటో చూపించారు చక్రి. రామ్ పోతినేని హీరోగా నటించిన మస్కా చిత్రంలో అద్భుతమైన పాటలకు సూపర్ గా సంగీత స్వరాలను అందించారు.


దేశముదురు, ఇడియట్ అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి, దేవదాసు, దేనికైనా రెడీ లాంటి చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్లు కావడానికి చక్రి సంగీతం ఒక కీలకమైన పాత్ర వహించింది అని చెప్పుకోవచ్చు. వాస్తవానికి చక్రికి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. తను అతి సామాన్యుడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టి... ఎనలేని ఖ్యాతిని సంపాదించినప్పటికీ... ఆ పాపులారిటీ ఎంతో కాలం నిలవలేదు. తాను ఉన్నత స్థాయిలో కొనసాగుతున్నప్పుడే అకాల మరణం చెందాడు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న చక్రి అతి చిన్న వయసులోనే మరణించేసరికి... తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోయింది.


శ్రోతలు కూడా చక్రీ మరణించాడనే వార్తను జీర్ణించుకోలేకపోయారు. చక్రి చివరిసారిగా ఎర్ర బస్సు అనే చిత్రానికి సంగీత బాణీలు అందించాడు. కేవలం స్వయంకృషితోనే పైకి వచ్చిన చక్ర అకాల మరణం చెందడం అప్పట్లో ఎంతో మందిని బాధించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాల్లో చక్రి నటించాడు. బాలకృష్ణ హీరోగా నటించిన సింహా చిత్రానికి సంగీత స్వరాలను అందించిన చక్రధర్ కి ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది పురస్కారం లభించింది. ఏదైనా చెడు సంగీత లోకంలో ఒక అద్భుతమైన మనిషిని కోల్పోయాం అని చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: