కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో పెరుగుతూ వస్తుంది..ఈ మేరకు లాక్ డౌన్ ను పూర్తిగా కఠిన తరంగా మారుస్తున్నారు.. ఇకపోతే లాక్ డౌన్ కారణంగా ప్రలజలతో పాటుగా సెలెబ్రెటీలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు.. సోషల్ మీడియా లో కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.. సెలెబ్రెటీలు మాత్రమే ఈ విషయం రచ్చ చేస్తున్నారు.. అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు.. 

 

 

 

 

 

 

మరో విషయమేంటంటే.. సినిమాలు, షో లు లేకపోవడంతో నటీనటులంతా గతంలో వారు చేసిన పనులను మళ్లీ ఎంచుకుంటున్నారు..కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ దెబ్బకు సినీ పరిశ్రమ మూతపడిన సంగతి తెల్సిందే.  సినిమా షూటింగ్స్ కూడా ఎక్కడికక్కడే  ఆగిపోయాయి. అయితే సినీ పరిశ్రమ నిలిచిపోవడంతో పెద్ద హీరో హీరోయిన్స్‌కు, నటీ నటులకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా... చిన్న చిన్న పాత్రలలో నటించే వాళ్ళు,  రియాలిటీ షోస్ చేసే వాళ్ల పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగానే మారింది. 

 

 

 

 

 

 

 

 

ఇలా సినిమా పరిశ్రమ మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి పని చేస్తున్న వేలాది కుటుంబాలపై కరోనా ప్రభావం చూపించింది. అయితే కరోనా దెబ్బకు ఎలాంటి పనులు లేకపోవడంతో ఇప్పటికే చాలా మంది సొంత ఊళ్లకు చేరుకున్నారు. ఇళ్ళలోనే ఉంటూ కుటుంబాలతో గడుపుతున్నారు. ఇందులో జబర్ధస్త్ జీవన్ కూడా ఒకడు. షూటింగ్స్ ఆగిపోవడంతో  సొంత ఊరైన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండెంరాజుపల్లి గ్రామానికి  వెళ్ళిన జీవన్... రైతుగా మారాడు. ఇంటి వద్ద వ్యవసాయ పనులు చేస్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నాడు. 

 

 

 

 

 

 

మొన్న ఈ మధ్య  చాలా మంది చేతి వృత్తలను చేస్తూ వస్తున్నారు.. ఇకపోతే కామెడీ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా తన పాత వృత్తికే మారాడు.. కంసాలి అయిన సంపూ సొంత ఊరికి వెళ్లి ఉన్న ముడి సరుకుతో  భార్య పిల్లలకు కాలి పట్టీలు తయారు చేశారు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోలు హీరోయిన్లు కూడా కుల వృత్తులకు పని చెప్తున్నారు . ఇలాగే లాక్ డౌన్ మరి కొద్ది రోజులు కొనసాగితే ప్రజలు పూర్తిగా సినిమాలను మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందుతున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: