తెలుగు సినిమా పరిశ్రమలో దివంగత మహానటుడు, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ ఉన్నది ఉన్నట్టుగా ముక్కు సూటిగా చెప్పేస్తారు. బాలయ్యకు లోపల ఒకటి ఉంచుకుని బయటకు మరొకటి చెప్పడం అలవాటు ఉండదు. ఆయన ఏం చెప్పాలన్నా ఏం చేయాలన్నా చాలా ఓపెన్‌గా నే ఉంటారన్న అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండస్ట్రీలో ఏ హీరో అయినా సినిమా చేయాలంటే దర్శకులు చెప్పిన కథ వినేటప్పుడే అనే క సార్లు మార్చాలని ఖండీషన్లు పెడతారు.. ఇక హీరోకు నచ్చిన హీరోయిన్ ఉండాలి... నచ్చిన ఆర్టిస్టులు ఉండాలి.. ఇవన్నీ ఓకే అయినా రేపు సినిమా సెట్స్ మీదకు వెళ్లాక హీరోలు దర్శకుల పనిలో వేలు పెట్టి కథను ఇష్టం వచ్చినట్టు కెలికేస్తూ నానా రచ్చ రచ్చ చేస్తున్నారు.
అయితే ఇప్పుడున్న హీరోల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం మీద ఒకసారి దర్శకుడికి ఓకే చెప్పాక బాలయ్య అస్సలు కథలోనూ, డైరెక్షన్‌లోనూ ఏ మాత్రం జోక్యం చేసుకున్న అభిప్రాయం అందరిలోనూ ఉంది. లోపల ఒకటి ఉంచుకుని బయటకు ఒకటి మాట్లాడడం బాలయ్యకు అస్సలు తెలియదు. ఇక బాలయ్య ఎవరిని అయినా కొట్టాలన్నా ఓపెన్‌గానే ఉంటారన్న టాక్ ఉంది. ఈ క్రమంలోనే ఆయన వ్యక్తిత్వంపై కొన్ని విమర్శలు ఉన్నా కూడా బాలయ్య ముక్కుసూటి తానాన్ని అందరూ మెచ్చుకుంటారు.
చాలా మంది హీరోలు లోపల ఒకటి పెట్టుకుని.. బయటకు ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఈ హీరోలనే కడుపులో కత్తులు దాచుకుని పైకి ప్రేమలు నటిస్తుంటారన్న టాక్ ఉంది. కానీ బాలయ్య మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. బాలయ్య మాట తీరు కూడా కొట్టినట్టే ఉంటుంది. అందుకే బాలయ్యను ఆయన అభిమానులే కాదు తెలుగు సినిమా అభిమానులు కూడా మెచ్చుకుంటూ ఉంటారు. లోపల అయినా బహిరంగ వేదిక మీద అయినా ఆయన ఉన్నది ఉన్నట్టు ఏకే 47 బుల్లెట్ ల్లాంటి మాటలతో కుండబద్దలు కొట్టేస్తారు.