తెలుగు సినిమాపై చెరగని సంతకం చేశారు. బాపు, రమణ. వారు తీసిన అత్యద్భుత చిత్రాలలో ‘అందాలరాముడు’ ఒకటి. బాపు దర్శకత్వంలో 1973లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన ఈ సినిమాకు ముళ్లపూడి వెంకటరమణ రచన చేశారు. భద్రాచలం శ్రీరాముడి దర్శనార్ధం గోదావరి నదిలో లాంచిపై వెళ్లడమే ఈ సినిమా నేపథ్యం. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. బాపు, రమణ అప్పటికే సక్సెస్ ఫుల్ దర్శక, రచయితలు. ఆ సినిమా షూటింగ్ సందర్భంలో బాపు, రమణలపై అక్కినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

IHG

 

సినిమా కాస్ట్ అండ్ క్రూ తోపాటు షూటింగ్ స్టాఫ్ చాలామంది సినిమా చిత్రీకరణ సమయంలో ఉండేవారు. షూటింగ్ జరిగనన్నాళ్లూ వారికి ఎటువంటి లోటు ఉండకూడదని బాపు, రమణల నిశ్చయించుకున్నారు. దీంతో ఎంతో జాగ్రత్తలు తీసుకుని అన్నంతోపాటు, నాలుగు రకాల కూరలు, పిండివంటలు, వండేందుకు, తినేందుకు బల్లలు సిద్ధం చేయించారు. ప్రతి రోజు పెళ్లి భోజనంలా పెట్టారు. ఖర్చు కూడా బాగా పెరిగిందట. ఇది గ్రహించిన అక్కినేని వారు ‘ఇది షూటింగా లేక పెళ్లి కార్యక్రమమా’ అని అందరి ముందూ బాపు, రమణలను తిట్టిపోశారట.

IHG

 

‘రోజూ ఇతంత ఖర్చు పెట్టి భోజనాలు పెట్టిస్తే నిర్మాతకు ఎంత ఖర్చో ఆలోచించారా. నాగేశ్వరరావుతో సినిమా తీసి నష్టపోయామని నిర్మాతలు చెప్పుకోవడానికా.. నాతో సహా అందరికీ మామూలు భోజనం పెట్టండి’ అని అందరి ముందూ అరిచేశారట. తర్వాత బాపు, రమణలను పిలిపించుకుని పరిస్థితి వివరించారట అక్కినేని. ‘ఇలాంటి భోజనం పెడితే తిని పడుకుంటారు కానీ.. పని చేస్తారా? అందరి చెప్తే పరిస్థితి అర్ధమవుతుందని అలా చేశాను. అర్ధం చేసుకోండి’ అని వివరించారట. విడుదలయ్యాక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. షూటింగ్ సమయంలో జరిగిన మర్యాదలు మాత్రం ఓ కథలా ఉండిపోయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: