టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మోహన్ బాబుది విలక్షణమైన శైలి. ఏ విషయంలో అయినా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టడంలో ఇండస్ట్రీలో మోహన్ బాబుకు మించినవారు లేరు. నాలుగు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో విలన్ గా హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న మోహన్ బాబుకు మిత్రులు కంటే శత్రువులు ఎక్కువగా ఉంటారు అన్న టాక్‌ అయితే ఇండస్ట్రీలో ఉంది. ఏ విషయంలో అయినా తనకు తానే సాటి అనిపించుకున్న మోహన్ బాబుకు హీరో అన్నది వాస్తవం. రాజకీయాల్లో అయినా.. సినిమా రంగంలో అయినా మోహన్ బాబు మాట అంటే ప్రతి ఒక్కరికి ఒక విధమైన భయం ఉంటుంది.

 

ఇక ఏ విష‌యంలో అయినా మోహ‌న్‌బాబు తొంద‌ర‌గా రియాక్ట్ కాడు... రియాక్ట్ అయితే వంద మంది వెయ్యి మంది ఉన్నా .. అది పెద్ద స‌భ అయినా చూడ‌డు.. తాను ఏం చెప్పాల‌నుకున్నానో ?  ఎవ‌రిని తిట్టాల‌నుకున్నానో తిట్టేస్తారు. ఓ సారి టాలీవుడ్ కింగ్ నాగార్జున మోహ‌న్ బాబు విష‌యంలో ఓపెన్‌గానే చేసిన వ్యాఖ్య‌లే మోహ‌న్‌బాబు వ్య‌క్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తాయి. ఇక మోహ‌న్ బాబు త‌న లేదా త‌న కుటుంబ వ్య‌క్తిగ‌త విష‌యాల్లో మాత్రం ఎవ్వ‌రిని త‌ల‌దూర్చ‌నీయ‌డు.. అలాగే ఎవ్వ‌రి ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌లోనూ ఆయ‌న ఇన్వాల్ కారు.

 

దాస‌రి లాంటి ఇండ‌స్ట్రీ పెద్ద అండ దండ‌లు మోహ‌న్ బాబుకు పుష్క‌లంగా ఉన్నా కూడా మోహ‌న్ బాబు ఇండ‌స్ట్రీలో చాలా మందికి శ‌త్రువు అయ్యాడు. ఇందుకు కార‌ణం ఆయ‌న ముక్కు సూటి త‌నం.. ముక్కోపిత‌న‌మే అని చెప్పాలి. అటు చిరంజీవితో మోహ‌న్ బాబుకు గ‌తంలో విబేధాలు ఉన్నా అవ‌న్ని త్వ‌ర‌గా మర్చి పోయి మ‌ళ్లీ ప‌బ్లిక్‌గానే ఒక‌రిపై ఒక‌రు చేతులు వేసుకోవ‌డం.. కౌగిలించుకోవ‌డం త‌మ మ‌ధ్య ఉన్న అప్యాయ‌త‌లు చూపించుకోవ‌డంలో వీరికి వీరే సాటి.

 

అయితే వీరి మ‌ధ్య గ్యాప్ అల్లు అర‌వింద్ కూడా ఓ కార‌ణం అని మోహ‌న్ బాబు అప్ప‌ట్లోనే బ‌హిరంగంగా చెప్పారు. ఇక అటు రాజ‌కీయ రంగంలో కూడా మోహ‌న్ బాబు ఎంతో మందికి స‌న్నిహితులు. అటు తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ &  ఫ్యామిలీకి అయినా.. ఇటు ఏపీలో సీఎం జ‌గ‌న్ కుటుంబంతో ఉన్న బంధుత్వం అయినా మోహ‌న్‌బాబును ఎప్పుడూ ప్ర‌త్యేకంగా నిల‌బెడ‌తాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: