ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా థియేటర్లు మూసివేయబడ్డ విషయం తెలిసిందే. ఇక సినిమా థియేటర్లన్నీ మూసి వేయడంతో పాటు ఓ సినిమా షూటింగ్ లు కూడా  నిలిచిపోయాయి . అయితే ప్రస్తుతం చిత్రీకరణ మధ్యలో ఉన్న సినిమాల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ అన్ని  పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా నిర్మాతలు మాత్రం ఎప్పుడెప్పుడు తమ సినిమాలను విడుదల చేద్దామ అని  ఆతృతగా ఉన్నారు. అయితే ప్రస్తుతం చాలామంది నిర్మాతలు లాగ్ డౌన్  కారణంగా సినిమా మూసివేయడంతో ఎక్కువగా డిజిటల్ ప్లాట్ఫారం ఆశ్రయించడానికి ముందుకు వెళ్తున్నారు. పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు అందరూ ఇలా డిజిటల్ ప్లాట్ఫాం వైపు ఆశగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అందరిని ఒక విజ్ఞప్తి చేసింది. 

 

 

 స్టూడియో భాగస్వాములు నిర్మాతలు కళాకారులు మరియు కంటెంట్ సృష్టికర్తలు అందరూ... తమ సినిమాలను కొన్ని రోజుల వరకు విడుదల చేయకుండా ఆపాలని... సినిమా ఎగ్జిబిషన్ రంగానికి మద్దతు ప్రకటించాలి అంటూ విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ప్రస్తుతం చాలామంది తమ తమ సినిమాలను ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా విడుదల చేయాలని భావిస్తున్నారని  అలా చేయడం ద్వారా సినిమా ఎగ్జిబిషన్ రంగం పూర్తిగా దెబ్బతింటుంది అంటూ తెలిపింది మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ సినిమా తో సహా పలు సినిమాలు... డిజిటల్ మీడియా లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు అంటు వస్తున్న వార్తల దృష్ట్యా ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపింది. 

 


 మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తిని  గౌరవించి  ప్రతి ఒక్కరూ... నిర్మాతలు కళాకారులు కంటెంట్ సృష్టికర్తలు తమ తమ సినిమాలను కొన్ని రోజుల వరకూ అలాగే ఉంచి థియేటర్లలో విడుదల చేయాలంటూ విజ్ఞప్తి చేసింది. సినిమా థియేటర్లకు సినిమా నిర్మాతలు కళాకారులకు ఎంతో విలువైన అనుబంధం ఉందని... అందుకే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎగ్జిబిషన్ రంగానికి కాస్త మద్దతు ఇవ్వాలి అంటూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోరింది . ఈ మేరకు స్టూడియోలు నిర్మాతలు కళాకారులు ఇతర కంటెంట్ సృష్టికర్తలు ఆ విజ్ఞప్తిని గౌరవించి తమ సినిమాలను డిజిటల్ మీడియా వేదికగా విడుదల చేయవద్దు అంటూ సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: