రీమేక్ సినిమాలకు మన తెలుగులో ఉండే గుర్తింపు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రీమేక్ సినిమాలను మన తెలుగు ప్రేక్షకులు కూడా బాగానే ఆదరిస్తూ ఉంటారు. అందుకే మన అగ్ర హీరోలు కూడా ఇప్పుడు రీమేక్ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి లూసిఫర్ సినిమాకు సంబంధించి రీమేక్ సినిమానే చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా వకీల్ సాబ్ సినిమా రీమేక్ అనే సంగతి తెలిసిందే ఇక వెంకటేష్ చేస్తున్న నారప్ప సినిమా కూడా రీమేక్ అనే సంగతి తెలిసిందే. 

 

ఇప్పుడు మరి కొందరు హీరోలు కూడా రీమేక్ సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేసారు అని అంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే రామ్ చరణ్ రీమేక్ సినిమాను చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అతను చేసే సినిమా ఏంటీ అనేది ఎవరికి తెలియదు. ఏ సినిమా చెయ్యాలో అర్ధం కాని పరిస్థితిలో రామ్ చరణ్ ఉన్నాడు అని అంటున్నారు. అందుకే ఇప్పుడు తమిళంలో హిట్ అయిన రీమేక్ సినిమాను ఆయన చేసే అవకాశం ఉంది అని సమాచారం. ఇప్పటికే తమిళంలో సూపర్ హిట్ అయిన ధ్రువ సినిమాను ఇక్కడ చేసి రామ్ చరణ్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. 

 

ఇప్పుడు ఈ క్రమంలోనే మరో సినిమాకు ఆయన ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఒక యువ దర్శకుడి తో ఆయన చర్చలు కూడా జరిపారు అని టాక్ వినపడుతుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే రీమేక్ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది అని సమాచారం. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆయన అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 8 న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నా వాయిదా పడుతుంది అనే సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: