దాసరి. ఆయనకు ఆయనే సరి అంటారు. ఆయనకు తెలియని విద్య‌ లేదు. ఒక సినీ నటుడు, దర్శకుడు, రాజకీయ నాయకుడు అయ్యాడు, పత్రికాధిపతిగా తన సత్తా చాటారు. సామాజికవేత్తగా, కార్మిక  పక్షపాతిగా ఇలా అనేక రూపాల్లో దాసరిని చూడాలి. దాసరి వంటి వారు అరుదుగా పుడతారు అని చెప్పాలి.

 

దాసరి నారాయణరావు ఒకే ఒక్కరు. టాలీవుడ్ కి ఆయన బతికి  ఉన్నపుడు పెద్దగా విలువ  తెలిసిందే లేదో తెలియదు కానీ ఆయన పోయిన తరువాత మాత్రం  ఒక్క లెక్కన అల్లాడుతోంది. ఓ విధంగా ఒంటరితనంతో ఉంది. ఆ టాప్ చైర్ ని ఎవరూ అధిరోహించలేకపోతున్నారు. దాసరి సింహంలా కూర్చున్న సింహాసనం ఎక్కాలంటే ఎవరికైనా బెరుకే. వణుకే.

 

దాసరిని మరొకరిలో ఊహించుకోవడం కూడా టాలీవుడ్ వల్ల కావడంలేదు. దాసరిలో గొప్ప విషయం ఏంటంటే ఆయన న్యాయం పక్షం. పేదల పక్షం. ఆయన మిగిలిన వాటికి అతీతుడు. దాసరి కి ఉన్నది గుండె నిబ్బరం, కొండనైనా ఢీ కొట్టే సాహసం. ఆయన పత్రిక పెట్టి అక్కడ ఉన్న మహా మహా మోతుబరులను ఒంటి చేత్తో ఎదుర్కొన్నాడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి కూడా పెత్తందారులను చెండాడాడు.

 

ఇక తాను ఉన్న సినిమా పరిశ్రమలో కూడా చిన్న కారు, సన్నకారు సినీ నిర్మాత పక్షంగా ఉంటూ  చివరి వరకూ  ఆయన పోరాడారు. దాసరి కూడా పెద్ద సినిమాలు తీశారు. కానీ ఆయనకు స్టార్లు కంటే కొత్త హీరొలు, వర్ధమాన హీరోలు ఇష్టం. అందుకే ఆయన ఎపుడూ వారికే ప్రోత్సహించేవారు. ఏది ఏమైనా దాసరి మా వారు, ఆయన ఇంటికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందని నమ్మిన టాలీవుడ్ కార్మిక లోకం అవే కళ్ళతో  వేరే వారిని అలా చూడలేకపోతోంది. 

 

ఇది దాసరి గొప్పతనంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక మనిషి పోతే ఆయన కుటుంబానికి లోటు ఉంటుంది. కానీ ఏకంగా దేశంలో అతి పెద్ద పరిశ్రమగా ఉన్న టాలీవుడ్ కే లోటు ఉందంటే అది ఎప్పటికీ భర్తీ చేయలేని లోటు అంటే నిజంగా దాసరి కారణజన్ముడేనని చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: