లోకనాయకుడు కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన సినిమా ‘మరుదనాయగం’. దాదాపు 23 ఏళ్ల క్రితం 1997 ఆగష్టులో ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించారు. ఈ సినిమా ఓపెనింగ్ కి క్వీన్ ఎలిజబెత్ రాణి2 ని ముఖ్య అతిథిగా విచ్చేశారు కూడా. కొన్నాళ్లు షూటింగ్ జరిగాక ఈ సినిమా ఆగిపోయింది. ఇప్పటికీ ఆ సినిమాపై అప్పుడప్పుడూ వార్తలు వస్తూంటాయి. కమల్ నుంచి ఎప్పుడూ సమాధానం రాలేదు. ఇప్పుడీ సినిమాపై విజయ్ సేతుపతితో జరగిన చర్చలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు కమల్.

IHG's 'Marudhanayagam' in small screen! - <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TAMIL' target='_blank' title='tamil-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>tamil</a> ...

 

ఓ వెబ్ చానెల్ కోసం ఇన్ స్టాగ్రామ్ ఆన్లైన్ చాట్ లో కమల్ – విజయ్ సేతుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంలో మరుదనాయగం సినిమా ఉంటుందా అని విజయ్ సేతుపతి కమల్ ను అడిగారు. దానికి కమల్ స్పందిస్తూ.. ‘మరుదనాయగం సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఆ కథను నేనే 40ఏళ్ల వయసులో ఉండగా రాసుకున్నాను. కానీ.. కొంత షూటింగ్ జరిగాక ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ తో ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడా కథ తెరకెక్కాలంటే ఇప్పుడు నేనున్న వయసులో ఆ సినిమా చేయలేను. ఆ వయసున్న వ్యక్తి హీరోగా మాత్రమే చేయగల సబ్జెక్ట్ అది. హీరో అన్వేషణ జరిగి షూటింగ్ జరపాలంటే కథలో చాలా మార్పులు చేయాలి. కాబట్టి ఇక మరుదనాయగం ఉండదు’ అని తేల్చి చెప్పేశారు కమల్.

IHG

 

అయితే.. తాను శ్రీకృష్ణుడి మేనమామ కంసుడి కథ రాసానని చెప్పుకొచ్చారు. కంసుడి మరణం తర్వాత కథగా ‘చిన్ని కంస’ అని పేరు కూడా పెట్టినట్టు చెప్పారు. ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉందని అన్నారు. అలాగా దేవర్ మగన్ (తెలుగులో క్షత్రియపుత్రుడు) కు సీక్వెల్ గా ‘తలైవర్ ఇరుక్కుండ్రిన్’ సినిమా తీస్తానని అన్నారు. దీనిలో విజయ్ సేతుపతి హీరోగా గతంలోనే ప్రకటించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by kamal haasan (@ikamalhaasan) on

మరింత సమాచారం తెలుసుకోండి: