కాస్టింగ్ కౌచ్‌.. ఇటీవ‌ల సినిమా ఇండ‌స్ట్రీల్లో ప‌దే ప‌దే వినిస్తున్న పేరు. ఇది ఒక్క తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు. అన్ని చిత్ర పరిశ్రమలలో కాస్టింగ్ కౌచ్ గురించి ఇటీవ‌ల అనేక చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్లు త‌మ‌కు ఎదురైన చేదు అనుభ‌వాల గురించి ఎలాంటి  నిర్మొహమాటం లేకుండా మీడియా ముందు బ‌య‌ట పెట్టేస్తున్నారు. వాస్త‌వానికి వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఇష్యూతో టాలీవుడ్‌లో తెరచాటు బాగోతం కాస్టింగ్ కౌచ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ త‌ర్వాత క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్న న‌టులు ఒక్కొక్క‌రిగా బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే ఈ కాస్టింగ్ కౌచ్ కేవ‌లం హీరోయిన్లు మాత్ర‌మే కాదు హీరోల‌కు కూడా ఎదుర‌వ్వ‌డం గ‌మ‌నార్హం.

 

ఇప్ప‌టికే రణవీర్‌ సింగ్‌ లాంటి పలువురు హీరోలు త‌మ‌కు ఎదురైన ఇలాంటి చేదు అనుభ‌వాల‌ను బ‌య‌ట పెట్టారు. ఇక తాజాగా బాలీవుడ్‌లో మ‌రో ప్ర‌ముఖ హీరో ఆయుష్మాన్‌ ఖురానా పరిశ్రమలో అడుగు పెట్టిన ప్రారంభంలో కాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొన్నానని హాట్ కామెంట్స్ చేశాడు. ఓ ఇంటర్యూలో ఖురానా మాట్లాడుతూ.. ``సినిమా ఛాన్స్‌ ఉందని ఓ దర్శకుడు ఆడిషన్‌కి పిలవడంతో అతని ఆఫీసుకి వెళ్లాను. ఆయన నువ్వు నీ ప్రైవేటు పార్ట్స్ చూపిస్తే నీకు సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఇస్తానని చెప్పాడు. ఇక క్షణం ఆలోచించకుండ వెంటనే ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాను`` అని చెప్పుకొచ్చాడు ఆయుష్మాన్‌ ఖురానా. ఇక‌ ఆ తరువాత కూడా తనకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పాడు ఆయుష్మాన్ ఖురానా. 

 

అంతేకాకుండా.. కెరీర్ స్టాటింగ్‌లో సోలో టెస్టు తీసుకుంటామని చెప్పి ఒకేసారి యాబై మందిని లోపలికి పిలిచేవారు. అయితే దీనిని నేను వ్యతిరేకిస్తే తిరిగి వెళ్లిపోమ్మని చెప్పేవారు. అలా నేను ఎన్నోసార్లు ఆడిషన్స్‌కు వెళ్లి తిరిగి వచ్చేవాడిని`` అంటూ తనకు ఎదురైన చేదు అనుభాన్ని గుర్తు చేసుకున్నాడు. అయితే ఈ తిరస్కరణల నుంచి ఇప్పుడు నేను మరింత బలవంతుడినయ్యాను అంటూటాలెంటెడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా చెప్పాడు. కాగా, ప్ర‌స్తుతం ఈయనకు బాలీవుడ్‌లో బాగానే క్రేజ్ ఉంది. అయితే ఆ క్రేజ్ వెన‌క తను పడిన కష్టం ఎంతో ఉందంటూ స్ప‌ష్టం చేశాడు. ఏదేమైన‌ప్ప‌టికీ.. ఆయుష్మాన్ మాట‌లు బ‌ట్టీ కాస్టింగ్ కౌచ్ చివ‌ర‌కు మ‌గ‌వారిని కూడా వ‌ద‌ల‌డం లేద‌ని అర్థం అవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: