సెలబ్రిటీలు తాము చేసే ప్రతి యాక్టివిటీకి సోషల్ మీడియా వేదిక అయింది. ముఖ్యంగా పలు ఛాలెంజ్ లకు సోషల్ మీడియానే వేదికైంది. ఇటివల కాలంలో ఈ ఛాలెంజెస్ లో ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ఈమధ్య పాపులర్ అయింది. ఈ ఛాలెంజ్ ను తెలుగు సినీ ప్రముఖులు ప్రారంభించారు. ఎందరో టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ ఈ ఛాలెంజ్ ను స్వీకరించారు.. చేశారు.. మరికొందరికి ఛాలెంజ్ విసిరారు. అయితే.. దీనిని ఇతర భాషల్లో విస్తృతం చేద్దామన్న మనవాళ్ల ఆశలు నెరవేరలేదు. తెలుగులోనే కొందరు సూపర్ స్టార్స్ పట్టించుకోలేదు కూడా.

 

 

లాక్ డౌన్ టైమ్ లో ఇంట్లో పనులు చేసి ఇంట్లోని ఆడవాళ్లకు హెల్ప్ చేయాలనేది ఈ ఛాలెంజ్ థీమ్. అయితే చిరంజీవి నుంచి రాజమౌళి వరకూ చాలామంది పాటించారు. అయితే చిరంజీవి నామినేట్ చేసిన రజినీకాంత్, మణిరత్నం, కేటీఆర్ ఇంతవరకూ స్పందించ లేదు. వెంకటేశ్ నామినేట్ చేసిన సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఇంతవరకూ స్పందించ లేదు. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ నామినేట్ చేసిన అల్లు అర్జున్, ప్రభాస్, అడివి శేష్ కూడా స్పందించ లేదు. రామ్ చరణ్ నామినేట్ చేసిన రణవీర్ కపూర్ కూడా ఈ ఛాలెంజ్ ను లైట్ తీసుకున్నాడు.

 

 

ఇప్పుడీ అంశమే చర్చనీయాంశమైంది. స్టార్ హీరోలైన చిరంజీవి, వెంకటేశ్, రామ్ చరణ్.. నామినేట్ చేయడం ఆయా హీరోలు పట్టించుకోకపోవడం చులకన అయినట్టే అనిపిస్తుంది. బన్నీ, ప్రభాస్, మహేశ్ లు స్పందించకపోవడానికి కారణం స్టార్ హీరోలు మొదట్లో తమను పట్టించుకోలేదు అనే భావనో తెలీదు. వారి తీరు ఇటువంటి అనుమానాలకే తావిస్తోంది. ఏమైనా స్టార్ హీరోలు తాము నామినేట్ చేసేముందు ఇటువంటి వాటిని స్వీకరిస్తారో లేదో ఆలోచిస్తే మంచిది. లేదంటే అదే సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్లు తథ్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: