‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభం నుండి అనేక కష్టాలు ఎదుర్కొంటూన్నాయి. సినిమా ప్రారంభంలో షూటింగ్ జరుగుతున్న టైములో హీరో ఎన్టీఆర్ కి మరియు రామ్ చరణ్ కి గాయాలు అవ్వడం జరిగింది. దీంతో రాజమౌళి రెండు నెలలపాటు ఈ సినిమా షూటింగ్ ను ఆపేయటం జరిగింది. అదే సమయంలో ఎన్టీఆర్ కి హీరోయిన్ దొరకడానికి చాలా టైం తీసుకోవటంతో...ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి షూటింగ్ చాలా ఆలస్యంగా స్టార్ట్ అయింది. మామూలుగా అయితే సినిమా ప్రారంభించిన సందర్భంలో ఈ ఏడాది జూన్ 30వ తారీకు సినిమా రిలీజ్ చేస్తున్నట్లు రాజమౌళి అప్పట్లో అధికారికంగా ప్రకటించారు.

 

అయితే సినిమాకి వరుస వాయిదాలు రావడంతో వచ్చే ఏడాది జనవరి 8వ తారీఖున సినిమా రిలీజ్ చేస్తున్నట్లు రాజమౌళి తెలపడం జరిగింది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ రావటంతో వచ్చే ఏడాది జనవరి 8వ తారీకు కూడా సినిమా రిలీజ్ అయ్యే అవకాశం లేదని అసలు ఇప్పట్లో రాదండి ‘RRR’ సినిమా అని అంటున్నారు. థియేటర్లు మరియు వైరస్ భయంతో సినిమాలకు జనాలు వచ్చే అవకాశం రాబోయే రోజులో చాలా తక్కువ కావడంతో...మళ్లీ మునుపటి రోజులు మాదిరి జనాలు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటేనే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు.

 

మొత్తంమీద చూసుకుంటే వచ్చే సమ్మర్ కి రిలీజ్ అవుతున్నట్లు ఫిలిం నగర్ లో వస్తున్న, వార్తలు వింటున్న సోషల్ మీడియాలో నెటిజన్లు అబ్బెబ్బే ఆ టైంలో కూడా గ్యారెంటీగా రిలీజ్ అవధాని ఫిక్స్ అయిపోతున్నారు. మరోపక్క డైరెక్టర్ రాజమౌళి కూడా ఇప్పుడే సినిమా గురించి ఏం చెప్పలేను అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనటం గమనార్హం.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: