ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రినారాయ‌ణ రావు 77వ జ‌యంతి ఈ రోజు  హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ప‌రిస‌రాల్లోని దాసరి విగ్రహానికి పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా ఆయ‌న కుమారుడు దాస‌రి అరుణ్ కుమార్ స‌మక్షంలో బాగానే జ‌రిపారు. అయితే ఆయ‌న శిష్యులు అయిన‌  ప్రియ‌శిష్యుడు సి.క‌ళ్యాణ్ స‌హా ప్రముఖ నిర్మాత దాసరి అరుణ్ కుమార్, కోడి పద్మ, కొమర వెంకటేష్, రాజేంద్ర కుమార్, బంగారు బాబు, పి.డి ప్రసాద్, రామసత్యనారాయణ తదితరులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ ఈ రోజుని డైరెక్ట‌ర్స్ డే గా గతంలో తెలుగు సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌క‌టించింది. ఈ క‌రోనా వ‌ల్ల డైరెక్ట‌ర్స్ అంద‌రూ లేకుండా సింపుల్ గా చేయాల్సి వ‌చ్చింది. సినీ ఇండ‌స్ట్రీలో దాసరి పేరు గుర్తుండేలా వచ్చే ఏడాది బర్త్ డేకి ప‌లు మంచి ప‌నులు చేస్తామ‌ని వెల్ల‌డించారు సి.కళ్యాణ్. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. దాస‌రి నారాయ‌ణ రావు గారి లాంటి ద‌ర్శ‌కులు ఇక‌పై సినీ ప‌రిశ్ర‌మ‌లో వస్తారో రారో కూడా తెలియదు. ఆయ‌న మా గురువు గారు అవ్వ‌డం మా అదృష్ట‌మ‌ని చెప్పారు. సంక్రాంతి.. ద‌స‌రా పండుగ‌ల్లాగే దాస‌రి గారి జ‌యంతిని ప్ర‌తి ఏటా పండుగ‌లా నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

 

అంతా బాగానే ఉంది కానీ.. దాస‌రికి ప్రియ‌త‌మ శిష్యుల్లో చాలా మంది మిస్స‌య్యారేమిటో? అర్ధం కాలేదు.  క‌రోనా లాక్ డౌన్ ఇబ్బందుల వ‌ల్ల చాలా మంది ముఖ్యులైన‌ దాస‌రి శిష్యులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేక‌పోయారు. ఇక దాస‌రి బ‌తికి ఉన్న‌న్నాళ్లు త‌న‌వ‌ల్ల లబ్ధి పొంది.. ఆర్థికంగా సాయం పొందిన చాలా  మంది ఈ జ‌యంతి కార్య‌క్ర‌మానికి రాకుండా ఎగ్గొట్టారు. ఎంత లాక్ డౌన్ ఉన్నా.. వీళ్లంతా ఛాంబ‌ర్ ప‌రిస‌రాల్లోనే ఉండి కూడా  రాలేద‌న్న విమ‌ర్శ‌లు ఒక‌ప‌క్క‌ వెల్లువెత్తాయి. అయినా రాజుగారే లేన‌ప్పుడు మంత్రులు, భ‌టులు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉంటారా ఏమిటీ?  అంటూ సెటైర్లు కూడా ప‌డుతున్నాయి. ఇక ఈ విష‌యం ప‌క్క‌న‌పెడితేదాస‌రి వెళ్లిపోయిన త‌ర్వాత ఇండ‌స్ట్రీకి అన్నీ తానే అయ్యి ఆదుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. మ‌రి ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న కూడా క‌నిపించ‌క‌పోవ‌డం కాస్త ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. క‌రోనా క్రైసిస్ చారిటీని ప్రారంభించి మెగాస్టార్ స్వ‌యంగా సినీకార్మికుల్ని ఆదుకుంటున్నారు. లేదంటే తిన‌డానికి తిండికి లేక న‌క‌న‌క‌లాడాల్సిన ప‌రిస్థితే ఉండేది. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. ప్ర‌స్తుతం దాస‌రి త‌ర్వాత అంత‌టివారేన‌న్న ప్ర‌శంస‌లు చిరు పై కురుస్తున్నాయి. ఒక‌వేళ ఇలాంటి టైమ్ లో దాస‌రి కూడా ఉండి ఉంటే ఆయ‌న ఆప‌న్న హ‌స్తం ఎంద‌రినో ఆదుకునేది అన్న భావ‌నా కార్మికుల్లో వినిపించింది. అలాగే ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి హాజ‌రై ఉన్నా బావుండేద‌న్న గుస‌గుస‌లు కాస్త ఇండ‌స్ట్రీలో వేడెక్కించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: