రైటర్ గా ఎన్నో సినిమాలకు కథలు అందించిన బివిఎస్ రవి డైరక్టర్ మారి చేసిన రెండు సినిమాలు అంచనాలను అందుకోలేదు. కొద్దిపాటి గ్యాప్ తో మళ్ళీ రైటర్ గా తన ఫామ్ కొనసాగించాలని చూస్తున్నాడు బివిఎస్ రవి. ఈమధ్య ఇంట్రెస్టింగ్ స్టోరీస్ రాసే పనిలో పడ్డాడు బివిఎస్ రవి ఆ కథలను యువ దర్శకులకు ఇచ్చేస్తున్నారట. లేటెస్ట్ గా ఫిలిం నగర్ టాక్ ప్రకారం ఉయ్యాలా జంపాల, మజ్ను ఫేమ్ విరించి వర్మ డైరక్షన్ లో బివిఎస్ రవి స్టోరీ ఒకటి ఫైనల్ అయ్యిందట. ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తారని తెలుస్తుంది. కరోనా ప్రభావంతో లాక్ డౌన్ అయ్యింది కానీ ఈ ప్రాజెక్ట్ ఫైనల్ డిస్కషన్స్ మాత్రమే ఉన్నాయని త్వరలో ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు. 

 

ఈ సినిమాలో హీరో ఎవరన్నది మాత్రం తెలియలేదు. ఇక ఈ సినిమాతో పాటుగా అక్కినేని హీరో నాగ చైతన్య విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కథ కూడా బివిఎస్ రవి అందించారని తెలుస్తుంది. ఈ సినిమా అఫీషియల్ గా ఎనౌన్స్ కాగా ఈ సినిమాకు టైటిల్ గా థ్యాంక్యూ అని పెట్టబోతున్నారట. ఈ సినిమా కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. అయితే చైతు సినిమా పాయింట్ విక్రమ్ కుమార్ దే కానీ దాన్ని డెవలప్ చేసింది మాత్రం బివిఎస్ రవి అని తెలుస్తుంది. 

 

తన కథలు తీసి దర్శకులు హిట్టు కొడుతుంటే బివిఎస్ రవి తాను మాత్రం డైరక్టర్ గా ఫెయిల్ అవుతున్నాడు. అందుకే రైటర్ గానే కెరియర్ కొనసాగించాలని ఫిక్స్ అయినట్టు ఉన్నాడు. ఈ రైటర్ నిర్మాతగా సెకండ్ హ్యాండ్ సినిమా కూడా వచ్చింది. అయితే డైరక్షన్, ప్రొడ్యూసింగ్ వీటికన్నా కథలు రాయడం బెటర్ అని భావించి ఉంటాడని సినీ విశ్లేషకులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: