కొందరు డైరెక్టర్లకు ఫస్ట్ సినిమాతోనే స్టార్ హీరోలను దర్శకత్వం చేసే అధృష్టం దక్కుతుంది. కొంతమంది రెండో సినిమా లేదా మూడో సినిమాతో స్టార్ హీరోలను డైరెక్ట్ చేస్తారు. మరికొందరు మాత్రం ఎక్స్ పీరియన్స్ ఉన్నా.. ఎన్ని మంచి సక్సెస్ రేట్ ఉన్న స్టార్ హీరోలను దర్శకత్వం చేసే అవకాశం దక్కదు. మారుతి పరిస్థితి కూడా దాదాపు ఇలాంటిదే. కెరీర్ ఆరంభం నుండి మారుతి, అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకూ ఈ దర్శకుడి బన్ని నుండి పిలుపు రాలేదు. 

 

మహానుభావుడు సినిమా తర్వాత ఎవరైనా స్టార్ హీరోతో సినిమా చేద్దామనే ఉద్దేశంతో మారుతి తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ సమయంలో బన్నీకి ప్రతీరోజు పండుగే కథ వినిపించాడు. బన్నీ కథలో కొన్ని మార్పులు చేర్పులు సూచించాడట. ఆ సమయంలో బన్నీ నా పేరు సూర్య సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా పూర్తికాగానే బన్నీతో ఫిక్స్ అని మారుతి అనుకున్నాడు. అయితే నా పేరు సూర్య ఫ్లాప్ కావడంతో హిట్ కోసం బన్నీ మరోసారి త్రివిక్రమ్ తో అల వైకుంఠపురములో సినిమా చేయాల్సి వచ్చింది. అలా మారుతికి బన్నీతో చేసే ఛాన్స్ మిస్ అయింది.

 

బన్ని, త్రివిక్రమ్ తో సినిమా చేయడంతో ప్రతీరోజు పండుగే సిినిమాను మారుతి, సాయి ధరమ్ తేజ్ తో చేసి భారీ హిట్ కొట్టాడు. అయితే ప్రస్తుతం మారుతి ఒక ఫ్యామిలీ స్టోరీని రెడీ చేసుకున్నాడట. ఈ సినిమాను బన్నీతో చేయాలని మారుతి మనసులో ఉందట. కానీ అల్లు క్యాంప్ మాత్రం ఈ ప్రాజెక్ట్ ను నానితో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. కానీ అల్లు క్యాంప్ మాత్రం ఈ ప్రాజెక్ట్ ను నానితో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ సినిమా లైన్ లో ఉంది. కనీసం మూడేళ్ల వరకు అల్లు అర్జున్ కాల్షీట్స్ అందుబాటులో లేవని అంటున్నారు. ఈ లెక్కన మారుతి వెయిటింగ్ పీరియడ్ మరింతగా పెరిగినట్టే. 

మరింత సమాచారం తెలుసుకోండి: